వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతామణి ఔషధ రాయి చోరీ కేసు: ఐదుగురు పోలీసుల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చింతామణి ఔషధ రాయి చోరీ కేసులో ఐదుగురు స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం గోపాలపురానికి చెందిన రామకృష్ణ జీడిపప్పు వ్యాపారి. ఆయనకు ఇటీవల వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది.

అయితే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధప్ప ఏడో తరానికి చెందిన ఔషధ రాయి రామకృష్ణ తాతల కాలం నుంచి వాళ్ల కుటుంబం వద్ద ఉంటూ వస్తోంది. ఈ ఔషధ రాయి, పాలు కలిపి కలిపి ఆయన వివిధ రకాల వ్యాధులను నయం చేస్తూ వస్తున్నారు. ఆ రాయిని రూ. 25 లక్షలకు విక్రయించేందుకు హైదరాబాదులోని దిల్‌షుక్ నగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి రామిరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

కరీం అలియాస్ రషీద్ అనే వ్యక్తి చింతామణి ఔషధ రాయిని రూ.25 లక్షలకు కొనేందుకు రామిరెడ్డితో మాట్లాడి ఓయు క్యాంపస్‌కు రావాలని చెప్పాడు. చింతామణి రాయితో ఓయు వద్దకు వచ్చిన రామిరెడ్డిపై దాడి చేసి అతని వద్ద గల రూ.14 వేలను, రెండు సెల్‌ఫోన్లను, ఔషధ రాయిని తీసుకుని పారిపోయారు.

Five constables arrested in Chinatamani case

రామిరెడ్డి సెల్‌లోని నెంబర్లను, వివరాలను చూసి రామకృష్ణకు ఫోన్ చింతామణి రాయి తమ ఉందని చెప్పి కొంటారా అంటూ రామకృష్ణను అడిగారు. అయితే, ఆ రాయి తనదేనని దాని చెప్పి రామిరెడ్డి వద్ద నుంచి తీసుకున్నారని ఆరోపిస్తూ వారిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్సెషల్ పోలీసు సిబ్బంది బాలు నాయక్, రాజగోపాల్, శ్రీను నాయక్, రాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెంకటరాజ్యాన్ని కూడా అరెస్టు చేశారు. కరీం పరారీలో ఉన్నాడు. వారి నుంచి రెండు బైక్‌లు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Hyderabad Osmania university police arrested five policemen in Chintamani case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X