హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీలకంగా బైక్: ముత్తూట్ దొంగలు ఇలా దొరికారు(పిక్చర్స్)

రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రాపురం బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రాపురం బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన సూత్రధారి లక్ష్మణ్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 3.5కిలోల బంగారం, 5లక్షల నగదు, రెండు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ సందీప్ శాండిల్య నిందితుల వివరాలను వెల్లడించారు.

పరారీలో మరో ముగ్గురు

పరారీలో మరో ముగ్గురు

దోపిడీతో సంబంధం ఉన్న మరో ముగ్గురు సుందర్‌ రాజరత్నం, కాలా అలియాస్‌ లంబూ, రోషన్‌యాదవ్‌లు పరారీలో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వీరు 20 ఏళ్ల నుంచి హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ముంబై మాఫియాతో లింక్

ముంబై మాఫియాతో లింక్

చోటారాజన్‌ ప్రధాన అనుచరుడు డికె.రావుకు వీరంతా అనుచరులుగా వ్యవహరిస్తున్నారని.. మాఫియా నేరాలు చేస్తూనే పోలీసుల దృష్టి మళ్లించేందుకు దారిదోపిడీలు, బ్యాంకులు, బంగారు ఆభరణాల దుకాణాలను దోచుకుంటున్నారని వివరించారు. వీరిందరిపై కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో పదుల సంఖ్యలో కేసులున్నాయని చెప్పారు.

41.8కిలోల బంగారంతో..

41.8కిలోల బంగారంతో..

డిసెంబరు 28, 2016న రామచంద్రాపురం ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 41.8 కిలోల బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న తర్వాత కర్ణాటకలోని హోళెకట్టె గ్రామానికి వెళ్లారని.. దోపిడీ విషయం పత్రికలు, ప్రసారసాధనాల్లో రావడంతో వాహనాన్ని అక్కడ ఉంచి పారిపోయారని వివరించారు.

 కడ్డీలుగా కరిగించి..

కడ్డీలుగా కరిగించి..

దోచుకున్న బంగారాన్ని నాసిక్‌లోని పాటిల్‌ ఇంట్లో కడ్డీలుగా కరిగించి ఎవరి వాటా వారు తీసుకెళ్లారని తెలిపారు. స్కార్పియో, డస్టర్‌ వాహనాలు, నిందితుల వూహాచిత్రాల ఆధారంగా 16 రోజులు శ్రమించి దొంగలను పట్టుకున్నామని వివరించారు.

మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంటాం..

మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంటాం..

పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకోవడంతో పాటు దొరికిన ఐదుగుర్ని విచారించి మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.

ముత్తూట్‌ ఫైనాన్స్‌పైనే గురి..

ముత్తూట్‌ ఫైనాన్స్‌పైనే గురి..

ముత్తూట్‌ శాఖల్లోని భద్రతా లోపాలు, ఆయా శాఖలు మొదటి అంతస్తుల్లో ఉండడం, దోపిడీకి అనుకూలంగా ఉండడంతో లక్ష్మణ్‌ వీటిపైనే గురిపెట్టాడు. కలబురిగి నుంచి హైదరాబాద్‌ వరకూ రహదారిపై ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ శాఖలను మూడేళ్ల నుంచి పరిశీలిస్తున్నాడు.

దోపిడీకి గురైన ముత్తూట్ శాఖ ఇదే..

దోపిడీకి గురైన ముత్తూట్ శాఖ ఇదే..

దాదాపు ప్రతిశాఖకు వెళ్లి లోపలి వ్యవస్థను పరిశీలించాడు. బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉన్న శాఖలను ఎంచుకున్నాడు. రామచంద్రాపురం శాఖలో సగం మంది యువకులు, అందులోనూ 40శాతం యువతులుండడంతో తాము సులభంగా దోపిడీ చేశామని లక్ష్మణ్‌ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో చెప్పడం కొసమెరుపు.

English summary
Four dacoits and a Mumbai-based jeweller were arrested in connection with the looting of 41.8 kg of gold from Muthoot Finance Company’s Ramachandrapuram branch on December 28. The dacoits had posed as CBI officials while the jeweller reportedly purchased the stolen gold from them at half the market price.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X