వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివరాత్రి వేడుకల్లో విషాదం: గోదావరిలో మునిగి ఏడుగురు యువకులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహా శివరాత్రి పర్వదినం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు.

|
Google Oneindia TeluguNews

భద్రాచలం: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నీట మునిగి 9 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కలలో విషాదం నెలకొంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని పుణ్యస్నానాలు చేసేందుకు ఐదుగురు యువకులు గోదావరి నదికి వెళ్లారు. ఇందులో ముగ్గురు యువకులు నీట మునగగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. మరో ఇద్దరి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు

భద్రాద్రిలో నలుగురు యువకులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహా శివరాత్రి పర్వదినం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. శివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో వారంతా మృతి చెందారు.

Four youth allegedly fell in to Godavari river and died, in Bhadrachalam district on Friday.

నదిలోని లోతైన గుంతను గుర్తించకపోవడం వల్లే వారు ఆ లోయలో పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. నదిలో మునిగిపోయిన నలుగురు యువకుల మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను పోలీసులు బయటకు వెలికితీశారు. మృతులను అల్లి నాగేంద్ర బాబు(22), గుడే ప్రేమ్‌కుమార్(22), తాంత్రపల్లి మురళి(22), బువనగిరి పవన్(22). ఈ విషాద ఘటన పినపాక మండలం చింతల బయ్యారంలో చోటు చేసుకుంది. నలుగురు యువకుల మృతితో వారి కుటుంబాలు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శామీర్‌పేటలో..

ఇక హైదరాబాద్ శామీర్‌పేటలోని పెద్దచెరువులో ఈతకెళ్లి ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మృతి చెందారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వీరిద్దరూ విద్యను అభ్యసిస్తున్నారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
Four youth allegedly fell in to Godavari river and died, in Bhadrachalam district on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X