ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానవత్వం బతికే ఉంది: చెత్త కుప్ప నుంచి శిశు గృహానికి...

ఖమ్మం నగరంలో ఆ మానవీయ ఘటన చోటు చేసుకుంది. చెత్తకుప్పలో పడిన ఓ శిశువును శిశు గృహానికి చేర్చి మానవీయతను ప్రదర్శించారు.ఆ శిశువు ఇప్పుడు రెండున్నర కేజీలకు పెరిగాడు.

By Oneindia Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం నగరంలో ఆ మానవీయ ఘటన చోటు చేసుకుంది. చెత్తకుప్పలో పడిన ఓ శిశువును శిశు గృహానికి చేర్చి మానవీయతను ప్రదర్శించారు.

మే 18వ తేదీ. ఉదయం పది గంటలు.

ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డులోగల ఆర్‌ఎస్‌ మెడికల్‌ షాపు వద్ద చెత్త కుప్ప. అందులో ఓ పసికందు (మగ). పుట్టిన వెంటనే తీసుకొచ్చి పడేసినట్టుగా ఒంటిపై రక్తపు చారికలు. ఆ పసికందు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఒంటి నిండా చీమలు. అటుగా వెళుతున్న అనేకమంది చూస్తున్నారు.

FROM DUSTBIN TO CHILD HOME...

కొద్దిసేపటి తరువాత ఒకరు ముందుకొచ్చారు. చేతుల్లోకి తీసుకుని, చీమలన్నిటిని దులిపేసి, జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్లు వెంకటేశ్వర్లు, శారద వెంటనే స్పందించారు. అత్యవసర వైద్యం అందించారు. అప్పుడు ఆ శిశువు బరువు ఒక కేజీ 400 గ్రాములు.

జూలై 6వ తేదీ.

థ్యాంక్‌ గాడ్‌! ఆ పసికందు క్షేమంగా ఉన్నాడు. చెత్తకుప్పల దుర్వాసనను, చీమల దాడిని తట్టుకుని బతికాడు..! కాదు.. కాదు.. వైద్య నారాయణులు కంటికి రెప్పలా చూసుకుంటూ బతికించారు. ఆ శిశువు ఇప్పుడు రెండున్నర కేజీలకు పెరిగాడు. ఐసీడీఎస్‌ పీడీ వరలక్ష్మి, ఆ శిశువును ఆస్పత్రి నుంచి శిశుగృహకు అప్పగించారు. 'బిడ్డా.. నువ్వు చల్లగా బతకాలి!' అంటూ, ఆ ఆస్పత్రి వైద్యులు తమ మనసులోనే మౌనంగా దీవించి పంపించారు..!!

English summary
A new born baby found in dustbin has been shifted to Child care centre in Khammam of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X