వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రుడే కానీ, రాజకీయాల్లో ఆలోచిస్తా: పవన్ కళ్యాణ్‌పై గద్దర్

జనసేన అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అని, రాజకీయాల్లో ఆయనతో కలిసి పని చేసే అవకాశాన్ని ఆలోచిస్తానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అని, రాజకీయాల్లో ఆయనతో కలిసి పని చేసే అవకాశాన్ని ఆలోచిస్తానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పవన్‌ కళ్యాణ్ స్థాపించిన జనసేన గురించి విస్తృతంగా చర్చ సాగుతోందని చెప్పారు. రాజ్యాధికారం చిటికెలో వచ్చేది కాదని గద్దర్ చెప్పారు.

<strong>'హిందీ గో బ్యాక్!', 'దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు'.. ఇవి చూడండి: పవన్ కళ్యాణ్</strong>'హిందీ గో బ్యాక్!', 'దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు'.. ఇవి చూడండి: పవన్ కళ్యాణ్

తన డెబ్బై సంవత్సరాల త్యాగాన్నే తాను అర్హతగా భావిస్తానని గద్దర్‌ ఈ సందర్భంగా చెప్పారు. త్వరలోనే అన్ని శక్తులను ఏకం చేస్తానని ఆయన అన్నారు.

ముందస్తు వచ్చేనా?

ముందస్తు వచ్చేనా?

తెలుగు రాష్ట్రాల్లో 'ముందస్తు' చర్చ సాగుతోంది. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అనే చర్చ జరుగుతోంది. నేతల దూకుడు కూడా ఆ దిశగానే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. త్వరలో ఎన్నికలు రానున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

సిద్ధమని పవన్ కళ్యాణ్

సిద్ధమని పవన్ కళ్యాణ్

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలకు దగ్గరవుతున్నారు. బీజేపీ - టీడీపీలకు దూరం జరుగుతున్నారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో పవన్ కూడా స్పందించారు. ఎన్నికలు ముందుగా వచ్చినా జనసేన సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించడం గమనార్హం.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వ్యాఖ్యలు

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి పార్టీలో గొడవలు సహజమని, తమ పార్టీలో త్వరలో ఈ గొడవలు ముగిసిపోతాయని చెప్పారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది.కానీ మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అందరూ సిద్ధమవుతున్నారా?

అందరూ సిద్ధమవుతున్నారా?

చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు త్వరలో ఎన్నికలు అని వ్యాఖ్యానించిన తర్వాత.. అంటే గత మూడు రోజులుగా ఈ చర్చ మరింత సాగుతోంది. పవన్ సిద్ధమని చెప్పడం, జనసేన అధినేతతో కలిసి పని చేస్తామని గద్దరె చెప్పడం... ఇవన్నీ చూస్తుంటే నేతలు ముందస్తుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా అర్థమవుతోంది.

జగన్ సిద్ధమా?

జగన్ సిద్ధమా?

వైసిపి అధినేత జగన్ అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని ఆశతో ఉన్నారు. కాబట్టి ముందస్తు వస్తే ఆయన కూడా సంతోషిస్తారని అంటున్నారు. కానీ కేసులు, వరుసగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆయనకు చిక్కులేనని చెప్పవచ్చు.

తెలంగాణలో తెరాస దూకుడు మీద ఉంది. క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందని, అది మరింత ఎక్కువ కాకముందే.. ముందస్తుకు వెళ్తారా అనే చర్చ సాగుతోంది. ఇటీవల రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఎరువుల వరాలు ప్రకటించడం చర్చకు దారి తీసింది.

English summary
Gaddar on Sunday said that he is thinking to work with Jana Sena chief Pawan Kalyan in politics. He said Pawan Kalyan his best friend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X