వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పార్టీ సిద్ధం: అప్పుడు కేసీఆర్‌కు ఇప్పుడు కోదండరాంకు ఆయనే కీలకం

తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెడతారంటూ ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కోదండరాం కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెడతారంటూ ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కోదండరాం కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాలతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

అప్పుడు కేసీఆర్‌కు.. ఇప్పుడు కోదండరాంకు

అప్పుడు కేసీఆర్‌కు.. ఇప్పుడు కోదండరాంకు

కాగా, 2001లో టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించిన గాదె ఇన్నయ్య.. కోదండరామ్ కొత్త పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో సన్నాహక కమిటీ సమావేశం జరుగుతుంది. రెండు నెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తామని, అనంతరం సెప్టెంబర్‌లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పార్టీ ఏర్పడుతుందని గాదె ఇన్నయ్య తెలిపారు.

పార్టీ ప్రణాళికలు

పార్టీ ప్రణాళికలు

మొత్తం 31 జిల్లాల నుంచి సన్నాహక కమిటీ సమావేశానికి ప్రతినిధులను ఆహ్వానించారు.
ఇద్దరి నుంచి ఐదుగురి వరకు ఒక్కో జిల్లానుంచి హాజరు కావాలని కోరారు. సన్నాహక కమిటీ సమావేశం అనంతరం పార్టీ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తారు. అదేవిధంగా పార్టీ ఏవిధంగా ఉండాలో నివేదిక రూపొందిస్తారు. వార్డుస్థాయి నుంచి ఎంపీ స్థానం వరకు పోటీ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఇన్నయ్య చెప్పారు.

బస్సు యాత్రతో మొదలు

బస్సు యాత్రతో మొదలు

రెండునెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించి, రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశానికి కారణాలను వివరిస్తామన్నారు. కాగా, సెప్టెంబర్‌లో పార్టీని ప్రకటిస్తారు. అప్పటివరకు కోదండరామ్ జేఏసీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. పార్టీ ఏర్పాటుకు సన్నాహక కమిటీ ఒకవైపు ఏర్పాట్లు చేస్తుండగానే, మరోవైపు కోదండరామ్ జేఏసీ కార్యకలాపాలు కొనసాగిస్తారు. సెప్టెంబర్‌లో పార్టీ ఏర్పాటు నిర్ణయం తరువాత కోదండరామ్ జేఏసీ నుంచి బయటకు వచ్చి పార్టీకి నాయకత్వం వహించే అవకాశాలన్నాయి.

కేసీఆర్ తీరు వల్లే..

కేసీఆర్ తీరు వల్లే..

తెలంగాణ కోసం అన్ని వర్గాలు ఉద్యమించాయని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైఖరి వల్ల ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు ఆయనకు దూరం అవుతున్నాయని, ఈ వర్గాలను కొత్తపార్టీలోకి ఆహ్వానిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి నుంచి 45 రోజుల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి కోదండరాం కొత్త పార్టీపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

English summary
Telangana leader Gade Innaiah responded on JAC Chairman Prof. Kodandaram's new political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X