వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు మార్కులు తక్కువొచ్చాయి, కారణం ఇదేనంటూ కెటిఆర్ సంచలనం

సర్వేలో నాకు మార్కులు తగ్గాయట జాగ్రత్తగా పనిచేయాలి...ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందేనని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.పార్టీ కార్యకర్తలకు తనకు మద్య అంతరం పెరిగిన విషయం వాస్తవమేనని ఆయన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:సర్వేలో నాకు మార్కులు తగ్గాయట జాగ్రత్తగా పనిచేయాలి...ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందేనని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు.పార్టీ కార్యకర్తలకు తనకు మద్య అంతరం పెరిగిన విషయం వాస్తవమేనని ఆయన ఒప్పుకొన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం నాడు టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కెటిఆర్ ప్రారంభించారు.

ktr

పార్టీ కార్యకర్తలతో తనకు కొంత గ్యాప్ వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు మంత్రి కెటిఆర్.

సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకుగాను స్పష్టమైన మాస్టర్ ప్లాన్, విధానం తనకు ఉందన్నారు.తనకు రాజకీయ భవితవ్యం ఇచ్చిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకొంటానని ఆయన చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ సభ్యత్వాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

English summary
ktr comments on kcr's survey on saturday. marks decreased in kcr's survey for me. gap between party workers for me ktr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X