మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్యాస్ పైప్‌లైన్ లీక్‌: మహా ప్రమాదంలో 4గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లాలోని సదాశివపేట దగ్గర రిలయన్స్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. అయినా మంటలు ఆగడం లేదు. తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సరఫరా నిలిపివేసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. కాకినాడ నుంచి మెదక్ మీదుగా గుజరాత్‌కు గ్యాస్ సరఫరా అవుతుంది.

మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రాపూర్ ఘోర్‌మయన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Gas pipeline leak in Medak district

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన రైతులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ సహా ఏడేళ్ల చిన్నారి మృతి

ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నల్లబల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళతో సహా ఏడు నెలల చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులు చర్ల మండలం తెగడ వాసులుగా గుర్తించారు.

English summary
Fire accident occurred in Medak district of Telangana due to leakage of Reliance gas pipeline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X