వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనో 'గే' సాఫ్ట్‌వేర్.. ఫేస్‌బుక్‌లో ఎంతమందిని బలిచేశాడంటే!

ఫేస్ బుక్ లో ప్రముఖుల పేరిట ఫేక్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసివారి మీద 'గే' ప్రచారం మొదలుపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు సురేష్.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భార్యతో విడిపోయి 'గే'('స్వలింగ సంపర్కుడు)గా మారాడు. పైకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలా హుందాగా కనిపిస్తాడు.. ఫేస్ బుక్ లోకి చొరబడ్డాడంటే మాత్రం గే చేష్టలతో ప్రముఖులను నానా తిప్పలు పెడుతాడు. గత కొన్నాళ్లుగా ఇతని విపరీత 'గే' ధోరణికి ఎంతోమంది పరువు పోగొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.. ఎక్కడ ఇంకా దిగజారిపోతామోనన్న భయంతో.. చాలామంది ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు.

అసలేం చేశాడు?

Gay techie was arrested for Harassing in facebook

తుమ్మల సురేష్.. బాచుపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్నికల్ లీడ్ గా పనిచేస్తున్నాడు. ఫేస్ బుక్ లో ప్రముఖుల పేరిట ఫేక్ ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసి
వారి మీద గే ప్రచారం మొదలుపెడుతాడు.

ప్రముఖుల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకోవడం.. వారి పేరుతో బోగస్ ఫేస్ బుక్ ఖాతాలను తెరవడం.. తాము 'గే'లమని, ఆసక్తిగలవారు సంప్రదించాలని పోస్టులు పెట్టడం.. సురేష్‌కు ఇదో అలవాటుగా మారిపోయింది. అలా ఫేస్ బుక్‌లో పోస్టులు పెట్టడంతో బాధితులకు 'గే'ల నుంచి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేవి.

ఎవరూ బయటకు చెప్పుకోలేదు!

Gay techie was arrested for Harassing in facebook

తమ మీద 'గే' ప్రచారం జరుగుతోందని చెబితే.. ఎక్కడ తమను అనుమానిస్తారోనన్న భయంతో.. సురేష్ ఆగడాలపై ఫిర్యాదు చేయడానికి బాధితులెవరు ధైర్యం చేయలేదు. 'గే' ఫోన్లతో ఇంట్లోను ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు బాధితులు.

Gay techie was arrested for Harassing in facebook

సురేష్ వేధింపులకు అంతిమంగా ఓ డాక్టర్ ముగింపు పలికాడు. ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సురేష్ ఆగడాలకు బ్రేక్ పడింది. సదరు డాక్టర్ పేరిట ఫేక్ 'గే' ఖాతా తెరిచి ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. పలు 'గే' వెబ్ సైట్ల వివరాలు కూడా అందులో ఉంచడంతో.. ఊపిరి సలపని ఫోన్లతో అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

టార్చర్ తట్టుకోలేక :

Gay techie was arrested for Harassing in facebook

మొత్తానికి సురేష్ వేధింపులకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన సదరు డాక్టర్.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోజు 50 ఫోన్లు స్వలింగ సంపర్కుల నుంచే వస్తుండడంతో.. అతడు ఆసుపత్రికి వెళ్లి పనిచేసుకోలేని పరిస్థితి తలెత్తింది. దీంతో తీవ్ర మానసిక వేధనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పాడు.

సురేష్ కు చెక్ పెట్టేశారు..

Gay techie was arrested for Harassing in facebook

సదరు డాక్టర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కేసును త్వరగానే చేధించారు. టెక్నాలజీ సహాయంతో.. సురేష్ పూర్తి వివరాలను సంపాదించారు. వెంటనే రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మియాపూర్ కోర్టులో అతన్ని హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

భార్యతో విడిపోయాక.. 'గే' అవతారం :

Gay techie was arrested for Harassing in facebook

భార్యతో విడిపోయాక ఇద్దరు స్నేహితులతో స్వలింగ సంపర్క సంబంధం పెట్టుకున్నాడు సురేష్. ఫేస్ బుక్ లో తొలినుంచే యాక్టివ్ గా ఉండే సురేష్.. 'గే' లాగా మారిపోయాక.. ఫేస్ బుక్ లో ప్రముఖులను టార్గెట్ చేసి విపరీతంగా వేధించడం మొదలుపెట్టాడు. సురేష్ 'గే' లాగా మారడం ఎవరికీ అభ్యంతరం లేకపోయినా.. తనవల్ల పలువురిని ఇబ్బందికి గురిచేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Suresh, A gay techie was arrested by Rachakonda Police commissionerate. He harassed somany people in facebook through a bad publicity on them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X