వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత అద్వాన్నంగానా?, హోటల్ ఫుడ్ ఎలా చేస్తున్నారో తెలిస్తే 'షాక్'

హోటల్ కిచెన్ లో సోదాలు చేయగా.. కుళ్లిపోయిన టమాటాలు, క్రితం రోజు అన్నం కనిపించాయి. అయితే ఇవి పారేయడానికి సిద్దంగా ఉంచినవి కావు, కస్టమర్లకు సర్వ్ చేసేందుకు సిద్దంగా ఉన్న ఆహారపదార్థాలు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హోటల్ భోజనమంటేనే బెంబేలెత్తిపోయే రోజులు వచ్చాయి. బడ్జెట్ హోటల్స్.. హై క్లాస్ హోటల్స్ అన్న తేడా లేకుండా.. ఏ హోటల్ పరిశ్రుభత ప్రమాణాలు పాటిస్తున్నట్లుగా కనిపించడం లేదు. నాణ్యత లేని, కుళ్లిపోయిన ఆహార పదార్థాలతో వంటకాలు సిద్దం చేసి.. కస్టమర్లకు లేనిపోని రోగాలు అంటించే ప్రయత్నం చేస్తున్నాయి నగరంలోని ఆయా హోటల్స్.

గత కొద్దిరోజులుగా నగరంలోని హోటల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. తాజాగా వనస్థలిపురంలోని స్వాగత్ హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్ కిచెన్ లో సోదాలు చేయగా.. కుళ్లిపోయిన టమాటాలు, క్రితం రోజు అన్నం కనిపించాయి. అయితే ఇవి పారేయడానికి సిద్దంగా ఉంచినవి కావు, కస్టమర్లకు సర్వ్ చేసేందుకు సిద్దంగా ఉన్న ఆహారపదార్థాలు.

Ghmc officials raid on hotel swagath in vanasthalipuram

దీన్నిబట్టి కేవలం మాంసాహారమే కాదు హోటల్స్ లో ఏ ఫుడ్ తిన్నా.. నాణ్యతకు గ్యారెంటీ లేదని స్పష్టమైంది.
నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్చి ఏమాత్రం నాణ్యత లేని ఆహార పదార్థాలతో వంటకాలు తయారు చేస్తుండటంతో.. స్వాగత్ హోటల్ యాజమాన్యానికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటివి రిపీట్ కావద్దని హెచ్చరించారు.

మరో హోటల్ పాపడమ్స్ లోను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం నాడు తనిఖీలు చేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నందుకు రూ.5వేలు జరిమానా విధించారు.

English summary
Greater hyderabad muncipal corporation officials held a ride on Swagath hotel in Vanasthalipuram. Officials found expired food items in hotel kitchen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X