వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2వేల నోటులో తప్పులు! నోట్లు వెనక్కి తీసుకుంటున్నారంటూ వదంతులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొత్త నగదు నోట్లతో ఓవైపు సామాన్యులు అష్టకష్టాలు పడుతుండగానే.. రూ.2వేల నోట్లపై ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. రూ.2వేల నోటును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని వదంతులు వ్యాపించడంతో.. సామాన్యులు మరింత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముంది.

నోట్లను వెనక్కి తీసుకోవడానికి కారణం.. నోటుపై ముద్రించిన ఆయా భాషల్లో పొరపాట్లేనని సోషల్ మీడియా వేదికగా వదంతులు వేగంగా విస్తరిస్తున్నాయి. కాగా, రూ.2వేల నోటుపై 'రెండు వేల రూపాయలు' అన్న అర్థ వచ్చేలా మొత్తం భారతీయ 15భాషల్లో ముద్రించారు.

gossip in social media : Govt was step back on two thousand notes

అయితే, 'దోన్ హజార్ రూపయా' 'దోన్ హజార్ రుపయే' అని మరాఠి, కొంకణి భాషల్లో ముద్రించిన అక్షరాల్లో పొరపాట్లు దొర్లాయని, అందువల్లే ప్రభుత్వం నోట్లను వెనక్కి తీసుకుంటుందంటూ లేని ప్రచారమొకటి విపరీతంగా జరుగుతోంది. ఇదంతా తప్పుడు ప్రచారమని, ఇందులో వాస్తవం లేదని పలువురు వదంతులను కొట్టిపారేస్తున్నారు.

English summary
Its a gossip going viral in social media that govt was taking 2000notes back. It was creating much more confusion in comman people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X