జీఎస్టీ దెబ్బ: కేటీఆర్ అభ్యర్థనలపై జైట్లీ మొక్కుబడి హామీలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దేశమంతా ఒకే పన్ను విధానం తేవడానికి సుదీర్ఘ కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే 'జీఎస్‌టీ' తేవడానికి సన్నాహాలు చేసినా.. ఆచరణలో సాధ్యం కాలేదు. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుతో వడివడిగా ఆర్థిక, పారిశ్రామిక రంగాలను ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి 'జీఎస్టీ' బిల్లు ఆమోదానికి ఎడతెగని ప్రయత్నాలు చేసిన ఫలితంగానే పార్లమెంట్, తర్వాత దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర తెలిపాయి.

కానీ ఒకే పన్ను విధానం ఉత్పాదక రాష్ట్రాలకు నష్టాలను మిగులుస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలు మినహాయింపేం కాదు. ప్రస్తుతంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వసూలు చేసే వ్యాట్‌.. మూలం ఆధారిత పన్ను. కానీ, జీఎస్‌టీ గమ్యస్థాన ఆధారిత పన్ను.. వ్యాట్‌లో ఏదైనా వస్తువు ఉత్పత్తి తయారీలో ప్రతి దశలోనూ ట్యాక్స్‌ పడుతుంది.

అదే జీఎస్‌టీలో తయారైన ఉత్పత్తిని విక్రయిస్తేనే పన్ను ఉంటుంది. అంటే దీనర్థం ఉత్పత్తులను తయారు చేసే ఉత్పాదక రాష్ట్రాలకు నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రత్యేకించి ఉత్పాదక సంస్థలు అధికంగా ఉన్న తెలంగాణలో జీఎస్టీ అమలు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు.

అంతా జీఎస్టీ పరిధిలోనే

అంతా జీఎస్టీ పరిధిలోనే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వ్యాట్, వినోదపు పన్ను, లగ్జరీ పన్ను, లాటరీ/గుర్రపు పందేల పన్ను, ప్రొఫెషినల్‌ ట్యాక్స్, గ్రామీణ సెస్సు, ప్రవేశ పన్నులను వసూలు చేస్తున్నాయి. ఆయా పన్నుల రూపంలో తెలంగాణకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.42,564 కోట్ల ఆదాయం రాగా.. ఇందులో సుమారు రూ.16 వేల కోట్లు ‘వ్యాట్‌'దే వాటా. అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.39,907 కోట్ల ఆదాయం సమకూరితే.. ఇందులో వ్యాట్‌ వాటా రూ.12,000 కోట్లు. జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలు నియంత్రణ అధికారాన్ని కోల్పోతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీలు, సులువైన వ్యా పార విధానాలనూ అమలు చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలిస్తామని పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు వ్యాట్‌ తగ్గింపులతో పాటూ తక్కువ ధరకే స్థల కేటాయింపు, విద్యుత్‌ బిల్లులో రాయితీ, రోడ్లు, మంచి నీటి వంటి మౌలిక వసతులనూ ఈ రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. జీఎస్‌టీ అమలయ్యాక రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను విధింపు, తగ్గింపు అధికారాలు కనుమరుగు అవుతాయి. అవి పూర్తిగా జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిధిలోకి వెళతాయి.

ఎంవోయూల పునఃసమీక్షలో కంపెనీలు..

ఎంవోయూల పునఃసమీక్షలో కంపెనీలు..

ఇప్పటివరకు స్థానిక ప్రభుత్వాల నుంచి పన్ను, ఇతరత్రా రాయితీలు పొందిన కంపెనీలకు జీఎస్‌టీ అమలుతో అవి కనుమరుగవుతాయి. దీంతో లాభాలు తగ్గుముఖం పడతాయని కేపీఎంజీ పరోక్ష పన్ను పార్టనర్‌ సంతోష్‌ దాల్వి చెప్పారు. అలాగే స్థానిక పన్నుల వసూళ్లతో రాష్ట్రాలూ తీవ్రంగానే నష్టపోతాయన్నారు. దేశమంతటా ఒకే తరహా పన్ను విధానం, స్థానిక రాష్ట్ర రాయితీలు లభించనప్పుడు కంపెనీలకు ఏ రాష్ట్రంలో అయితే మౌలిక, రవాణా వసతులు మెరుగ్గా ఉంటాయో అక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేసే స్వేచ్ఛ కలుగుతుందని వివరించారు. దీంతో రాష్ట్రాల మధ్యే పోటీ పెరుగుతుందని, కాకపోతే ఇది అంత త్వరగా తేలే విషయం కాదని చెప్పారు. జీఎస్‌టీ అమలుతో ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణకు నష్టం కాస్త ఎక్కువే. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలూ అందనప్పుడు స్థానిక కంపెనీలకు రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఏపీలోని తయారీ సంస్థలైనా స్థానికంగా ఉన్న సముద్రాన్ని ఎగుమతులకు వినియోగించుకునే వీలున్నదని మరో కంపెనీ ప్రతినిధి వివరించారు. ఒకవేళ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు గనక చేతులెత్తేస్తే.. కార్యకలాపాల విస్తరణ వంటి వాటికి దూరంగా ఉంటే మరింత ముప్పే. మరోవైపు ఇన్నాళ్లూ పన్ను రాయితీలను చూసి వచ్చిన కంపెనీలు ఇప్పుడు ఎంవోయూలను పునః సమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.

ఒప్పందాలూ సమీక్షించనున్న సంస్థలు

ఒప్పందాలూ సమీక్షించనున్న సంస్థలు


ప్రస్తుతం తెలంగాణలోని జహీరాబాద్‌లో 100 ఎకరాల్లో మహీం ద్రా అండ్‌ మహీంద్రా ట్రాక్టర్ల ప్లాంట్, మెదక్‌లోని కోడకచాని గ్రామంలో 18 ఎకరాల్లో డెక్కన్‌ ఆటో లిమిటెడ్‌ బస్‌ బాడీ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఏపీలో శ్రీసిటీలో 107 ఎకరాల్లో ఇసుజు మోటార్స్‌ ఇండియా ఎస్‌యూవీ ప్లాంట్, 20 ఎకరాల్లో కొబెల్కో క్రెయిన్‌ ప్లాంటు, చిత్తూరులోని సత్యవీడులో 600 ఎకరాల్లో హీరో మోటోకార్ప్‌ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లు పని చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులతో బస్, ట్రక్స్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. హ్యుందాయ్‌ మోటార్స్‌ అనుబంధ సంస్థ కియా మోటార్స్‌.. అనంతపురంలోని ఎర్రమంచి గ్రామంలో 600 ఎకరాల్లో కార్ల తయారీ యూనిట్‌నూ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నది.

పరిహారంపై కేంద్రం హామీ అమలయ్యేనా?

పరిహారంపై కేంద్రం హామీ అమలయ్యేనా?

జీఎస్‌టీ అమలుతో ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. నష్టపోయిన ఆదాయంలో తొలి మూడేళ్లు 100 శాతం, నాలుగో ఏట 75 శాతం, చివరి ఏడాది 50 శాతం పరిహారంగా అందిస్తుంది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య వస్తువులు, సేవలు జరిపే సంస్థల నుంచి రెండేళ్ల పాటు జీఎస్‌టీ పన్నుతో పాటు 1 శాతం అదనపు పన్నునూ వసూలు చేస్తుంది. దీన్ని నష్టపోతున్న రాష్ట్రాలకు అందజేయనున్నది. రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తకుండా హామీలిస్తున్న కేంద్రం జీఎస్టీ అమలు మొదలైన తర్వాత వాటికి కట్టుబడి ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వివరాలిస్తే పరిశీలిస్తామన్న జైట్లీ

వివరాలిస్తే పరిశీలిస్తామన్న జైట్లీ

జీఎస్టీ అమలుతో తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదన్న సంకేతాలు అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ తదితర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలను ‘జీఎస్టీ' పరిధి నుంచి తప్పించాలని రెండు రోజుల క్రితం జరిగిన జీఎస్టీ పాలక మండలి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. దీనిపై ప్రతిస్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తే వచ్చే జీఎస్టీ పాలక మండలిలో చర్చిద్దామని పేర్కొన్నారే గానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న పలు పన్నులకు ప్రత్యామ్నాయాలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిష్పత్తుల విషయమై రాష్ట్రాల అభిప్రాయాలకు విలువలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మరో పది రోజుల్లో జీఎస్టీ అమలుకు రంగం సిద్దమవుతున్న తరుణంలో స్పందించడానికి బదులు తొలుత స్పందించి కేంద్రం ద్రుష్టికి తెస్తే.. నష్ట నివారణకు మార్గం ఉండేదన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Every thing shoul be ready to implement next month for GST while One nation - One tax idea is best but it will effect on Telangana and Andhra Pradesh States. Particularly serious effect on Telangana. But Union Government not to heel state's concerns.
Please Wait while comments are loading...