హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మరో పది నిమిషాల్లో విధులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్లాల్సిన సమయంలో అకస్మాత్తుగా తుపాకి పేలి ఓ పోలీసు కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం నల్గొండ జిల్లాలోని చందంపేట పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన గొంగుడాలి వెంకటేశ్వర్లు (బ్యాచ్‌నెంబర్‌ 1516) తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ 2013లో ఉద్యోగంలో చేరాడు. 15 రోజుల క్రితం చందంపేట పోలీస్‌స్టేషన్‌లో విధి నిర్వహణ నిమిత్తం వచ్చాడు.

ఎప్పటిలాగే మంగళవారం పోలీస్‌స్టేషన్‌ పైభాగంలో ఉన్న గదిలో సెంట్రి డ్యూటి(గార్డ్‌)లో తనతోపాటు మరో ఐదుగురు టీఎస్‌ఎస్‌పీ పోలీసులు ఉన్నారు. విధుల్లో భాగంగా మంగళవారం స్టేషన్‌లో సెంట్రీ డ్యూటీ నిర్వహిస్తుండగా, మధ్యాహ్నం 3గంటల సమయంలో అకస్మాత్తుగా అతని చేతిలోని ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్ మిస్‌ఫైర్ అయింది.

 నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఒక రౌండ్ తూటా అతని ఛాతిలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్‌పరిణామంతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే అతని వద్దకు చేరకుని రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్వర్లును 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్న వెంకటేశ్వర్లు ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

మరో నాలుగు రోజుల్లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పెళ్లి ఉందనగా ఈ ఘటన చోటుచేసుకోవడం ఇరుకుటుంబీకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గోంగిడాల వెంకటేశ్వర్లుకు గుర్రంపోడు మండలానికి చెందిన అతని మేనమామ కూతురుతో ఈ నెల 6న వివాహం జరగాల్సి ఉంది.

 నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఈ సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం బాధకరమని తోటి పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు విధి నిర్వహణలో జరిగినా పొరబాటా! లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ చంద్రమోహన్‌, సీఐలు గట్టు మల్లు, వెంకటేశ్వర్‌రెడ్డి చందంపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు.

నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

నాలుగు రోజుల్లో వివాహం: తుపాకీ మిస్‌ఫైర్, పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఈ ఘటనపై ఆరా తీశారు. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి ఘటన వివరాలను సేకరించారు. గాయపడ్డ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని డీఎస్పీ తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు చెప్పారు.

English summary
Gun Misfire in Chandampet Police Station at Nalgonda District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X