బాబు బయటపడినా.. గుణశేఖర్ ప్రశ్నతో రివర్స్: కేసీఆర్‌కు 'బాలకృష్ణ' చిక్కు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడులకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విమర్శలను తెచ్చి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు.

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడులకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విమర్శలను తెచ్చి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు.

'గౌతమీపుత్ర శాతకర్ణి': చంద్రబాబును బయటపడేసిన కేసీఆర్!

ఈ సినిమాకు తొలుత తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయించింది. వినోదపు పన్ను మినహాయించడం చర్చనీయాంశమైంది. దీనిని స్వాగతిస్తున్నప్పటికీ.. తమ సినిమాలకు ఎందుకివ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!

రుద్రమదేవి మాటేమిటి?

 

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయించడాన్ని ప్రముఖ దర్శకులు గుణశేఖర్ స్వాగతించారు. అయితే, 2015లో విడుదలయిన తన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణలో మినహాయింపు ఇవ్వగా, ఏపీలో చంద్రబాబు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. గౌతమీపుత్రకు ఇచ్చినట్లుగానే రుద్రమదేవికీ ఇవ్వాలని, తాను కట్టిన ట్యాక్స్ చెల్లించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.

 

కేసీఆర్ తర్వాత చంద్రబాబు

 

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తొలుత కేసీఆర్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయించింది. ఆ తర్వాత రెండు రోజులకు చంద్రబాబు ప్రభుత్వం మినహాయించింది. తెలంగాణ తర్వాత చంద్రబాబు మినహాయించినందువల్ల టిడిపి ప్రభుత్వాన్ని కేసీఆర్ విమర్శలు రాకుండా కాపాడారనే చర్చ సాగింది. బాలకృష్ణ.. చంద్రబాబుకు బావమరిది. కాబట్టి గౌతమీపుత్రకు ఏపీ తొలుత వినోదపు పన్ను మినహాయిస్తే కచ్చితంగా విమర్శలు వచ్చేవని అంటున్నారు. బావమరిది కాబట్టి అలా చేసారని చెప్పేవారని, కానీ కేసీఆర్ మొదట మినహాయించి చంద్రబాబును విమర్శల నుంచి కాపాడారు.. అనే చర్చ సాగింది.

 

గుణశేఖర్ నిలదీతపై...

 

అయితే, చంద్రబాబును కేసీఆర్ కాపాడినా, దర్శకులు గుణశేఖర్ నిలదీత మాత్రం కాపాడలేకపోయిందని అంటున్నారు. రుద్రమదేవికి నాడు కేసీఆర్ వినోదపు పన్ను మినహాయించారు. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా మినహాయించారు. కానీ ఏపీలో రుద్రమదేవికి మినహాయించకుండా, గౌతమీపుత్రకు ఎందుకు మినహాయించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

కేసీఆర్‌కూ శాతకర్ణి చిక్కులు

 

మరోవైపు, కేసీఆర్ కూడా విమర్శలు రాకపోలేదు. రుద్రమదేవి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి ఏపీ వాళ్లు తీసే సినిమాలకు నిమిషాల మీద వినోదపు పన్ను మినహాయిస్తున్నారని, తెలంగాణలోని వారికి మాత్రం అలాంటి ప్రోత్సాహం లేదని ఇంకొందరు అంటున్నారు.

 

English summary
Gunasekhar letter to Chandrababu Naidu over Rudramadevi tax exemption.
Please Wait while comments are loading...