వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మిషన్’ హెల్ప్‌లైన్ ప్రారంభించిన హరీశ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మిషన్ కాకతీయ పేరుతో జరుగుతున్న చెరువుల్లోని పూడిక తీసివేతకు సంబంధించి సమస్యలు, సమాచారం ఇవ్వాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. 040- 23472233 నంబర్‌కు మిషన్ కాకతీయకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వదలచిన వారు ఫోన్ చేయవచ్చునని హరీశ్‌రావు తెలిపారు.

త్వరలోనే మిషన్ కాకతీయ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిషన్ కాకతీయలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిన రైతులు తమ పొలాల్లో వేసుకోవాలని సూచించారు. రైతులు ముందుకు రాకపోతేనే ఈ మట్టిని ఇతర అవసరాలకు ఉపయోగించాలని అన్నారు.

ఏప్రిల్ 19న తెలంగాణ జెఏసి మిషన్ కాకతీయలో శ్రమ దానం చేయాలని నిర్ణయించడాన్ని అభినందిస్తున్నట్టు, స్వాగతిస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. 6,918 చెరువుల్లోని పూడిక తీసివేయడానికి 2,137 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా పరమైన అనుమతి మంజూరు చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయపై ప్రారంభంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారని, ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ప్రారంభించారని హరీశ్‌రావు తెలిపారు.

మిషన్ కాకతీయ పనుల్లో 2500 బుల్డోజర్లు పని చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి వారికి ఈ పనులు కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ టిడిపి నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు తొత్తులుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టిడిపి నాయకులు బాబును వీడి తెలంగాణ కోసం మాట్లాడాలని అన్నారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

మిషన్ కాకతీయ పేరుతో జరుగుతున్న చెరువుల్లోని పూడిక తీసివేతకు సంబంధించి సమస్యలు, సమాచారం ఇవ్వాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

040- 23472233 నంబర్‌కు మిషన్ కాకతీయకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వదలచిన వారు ఫోన్ చేయవచ్చునని హరీశ్‌రావు తెలిపారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

త్వరలోనే మిషన్ కాకతీయ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిషన్ కాకతీయలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

చెరువుల్లో పూడిక తీసిన మట్టిన రైతులు తమ పొలాల్లో వేసుకోవాలని సూచించారు. రైతులు ముందుకు రాకపోతేనే ఈ మట్టిని ఇతర అవసరాలకు ఉపయోగించాలని అన్నారు.

English summary
Telangana Minister Harish Rao on Thursday launched Mission Kakatiya helpline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X