వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటిఆర్‌లా... హరీష్ రావుకూ ప్రమోషన్, బరువు దించుకోనున్న కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు మరో బాధ్యత అప్పగించనున్నారని తెలుస్తోంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తెరాసక పార్టీ ఘనవిజయం ఖాయమని వివిధ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన హరీశ్ రావుకు మరో ముఖ్య శాఖను సీఎం కెసిఆర్ అప్పగించవచ్చునని అంటున్నారు. నారాయణఖేడ్ ఫలితాలు రాగానే హరీశ్ రావుకు సమాచార, పౌర సంబంధాల శాఖను అప్పగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో విజయం అనంతరం... ప్రచార బాధ్యతలు చేపట్టిన మంత్రి కెటి రామారావుకు కీలకమైన మునిసిపల్ శాఖను కెసిఆర్ అప్పగించారు. ఇదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులను సమానంగా చూడాలంటే మరో శాఖను అప్పగించాలని కొందరు నేతలు కెసిఆర్ దగ్గర అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

Harish Rao set to get I&PR responsibility

తన వద్ద ఉన్న శాఖలను పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుకు కూడా ప్రమోషన్ దక్కుతుందని అంటున్నారు.

కాగా, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తెరాస 70వేల మెజార్టీతో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. రెండో స్థానం కోసం కాంగ్రెస్, టిడిపిలు పోరాడాయి. అయితే ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి మంత్రంతో హరీష్ రావు ఓటర్లను ఆకట్టుకున్నారు.

English summary
CM K Chandrasekhar Rao will divest more portfolios to fellow ministers. Irrigation minister T. Harish Rao is likely to be given additional responsibility of the Information and Public Relations department which oversees government publicity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X