హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐడియాలివ్వండి: రేడియో మిర్చిలో మేయర్ బొంతు, ఏమన్నారంటే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతి పౌరుడు సలహాలు, సూచనలు అందించి నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన బేగంపేటలోని రేడియో మిర్చి కార్యాలయంలో శ్రోతలతో ముచ్చటించారు. అందరం కలిసి సిటీని విశ్వనగరంగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా చెట్లు, మొక్కల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీంలపై శ్రోతలు మేయర్‌కు సలహాలు అందించారు. కార్యక్రమ అనంతరం మేయర్ మాట్లాడుతూ ఒక మొక్కను తీస్తే రెండు మొక్కలు నాటేలా, రానున్న వర్షాకాలంలో జీహెచ్ఎంసీ రోడ్లపై ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

నాలుగు వారాల పాటు ప్రతి ఆదివారం రేడియో మిర్చి శ్రోతలతో మాట్లాడనున్నట్టు తెలిపారు. అనంతరం గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వంద రోజుల పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలో రూ.26కోట్ల వ్యయంతో 40 మోడల్ మార్కెట్లను నిర్మిస్తున్నామన్నారు.

 రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్

రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్

రాజేంద్రనగర్ సర్కిల్‌లో బస్‌బేల నిర్మాణం, మోడల్ మార్కెట్, జిమ్‌ల ఏర్పాట్లు, ప్రేమావతిపేటలో నిర్మించిన మోడల్ మార్కెట్‌ను, దుర్గానగర్‌లో పూర్తయిన బస్‌బే, పంజాగుట్టలో నిర్మిస్తున్న శ్మశానవాటికను, షేక్‌పేట్‌లోని మల్కాపూర్ నాలా పూడికతతీ పనులను, జూబ్లీహిల్స్ విస్పర్‌వ్యాలీలో నిర్మించిన అత్యాధునిక శ్మశానవాటిక మహాప్రస్థానాన్ని మేయర్ పరిశీలించారు.

రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్

రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్


ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోడల్ మార్కెట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. అర్హులకు షాపులు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లను మేయర్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఆపడానికి రూ.3కోట్ల వ్యయంతో 50 బస్‌బేల నిర్మాణానికి పూనుకున్నట్లు పేర్కొన్నారు.

 రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్

రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్


వీటిలో దాదాపు 40శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. దేశంలోనే ఏ మున్సిపల్ కార్పొరేషన్ చేయని విధంగా నగరంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చినట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 1352 ప్రాంతాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించడంతో పాటు 150 ఆధునిక జిమ్‌లను ఏర్పాటు చేస్తామని, 329 క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

 రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్

రేడియో మిర్చి 'హాయ్ హైదరాబాద్'లో మేయర్


జూబ్లీహిల్స్‌లోని శ్మశాన వాటికలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు ఎలక్ట్రిక్ క్రిమిటోరియం తదితర సౌకర్యాలు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ రూ.కోటి వ్యయంతో పంజాగుట్టలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తోందన్నారు. ఇందులో పార్కింగ్ సౌకర్యం, స్నానఘట్టాలు, పూజ కార్యక్రమాల నిర్వహణ గదులు, అంతర్గత రోడ్ల నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులను పరిశీలించారు.

English summary
Hyderabad's Mayor Sri Bonthu Ram Mohan garu in an interaction with RJ Hemanth and listeners, on 'Hi Hyderabad' show on Radio Mirchi 98.3 FM, Today at Radio Mirchi studio at Begumpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X