హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ పరిశ్రమలు: హిటాచీతో సీఎం కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో భారీయంత్ర పరిశ్రమలను నెలకొల్పాలని జపాన్‌కు చెందిన ప్రసిద్ధ పారిశ్రామికసంస్ధ హిటాచీ ప్రతినిధులను సీఎం కేసీఆర్ కోరారు. పరిశ్రమల స్థాపనకు సకల సౌకర్యాలున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనువైనదని అన్నారు.

తమ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)తో పెట్టుబడిదారులకు తెలంగాణ మరింత ఆకర్షణీయంగా మారుతుందని అన్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ హిటాచీ సొల్యూషన్స్ ఇండియా సీఈవో, ఎండీ అనంత్ నారాయణన్, సంస్థ అధ్యక్షుడు, సీవోవో మైక్ గిల్లిస్, ఉపాధ్యక్షుడు గ్యారీ పీటర్సన్ శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో హిటాచీ సంస్థను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ టీఎస్ ఐపాస్‌లోని ప్రత్యేకతలు, రాష్ట్రంలోని మౌలికసదుపాయాలతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా ఉత్సాహం చూపుతారని అన్నారు. టీఎస్ ఐపాస్‌ను త్వరలోనే లాంఛనంగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

 భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిటాచి సంస్థ ప్రతినిధులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి స్మార్ట్ సిటీల నిర్మాణం, స్మార్ట్‌కార్డ్ సొల్యూషన్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో సేవలందిస్తామని హిటాచీ సొల్యూషన్స్ ఇండియా సీఈవో అనంత్ నారాయణన్ తెలిపారు.

 భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

2013 నుంచి తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ వచ్చే ఆగస్టులో విస్తరణను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. విస్తరణ కార్యక్రమాలను ఆవిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

 భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర చోట్ల స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టేందుకుగల అవకాశాలను పరిశీలించాలని హిటాచీ ప్రతినిధులను సీఎం కోరారు. హిటాచీ సంస్థ భారీ యంత్రాల ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటుచేస్తే అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

భారీ పరిశ్రమలు: హిటాచీ ప్రతినిధులతో కేసీఆర్

హిటాచీ ప్రతినిధి బృందంతోపాటు సీఎంను కలిసినవారిలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, సీఎం ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ వైస్‌చైర్మన్, ఎండీ శాలినీమిశ్రా తదితరులున్నారు.

English summary
Hitachi Team meeting with Chief Minister Kcr at Camp Office at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X