వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంచల్‌గూడ జైలులో నాయిని ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం నాడు హైదరాబాదులోని చంచల్ గూడ జైలును సందర్శించారు. జైలులో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాగా, అంతకుముందు నాయిని నర్సింహా రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారు సోమవారం మధ్యాహ్నం పంక్చర్ అయింది. కారు పంక్చర్ అయినప్పుడు ఆయన ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు.

వాహనం పంక్చర్ కావడంతో డ్రైవర్ కారును నెమ్మెదిగా రోడ్డు పక్కన ఆపాడు. దీంతో నాయిని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ కారులో వెళ్లారు. అనంతరం ఆసుపత్రి నుండి ప్రయివేటు కారులో ఆయన చంచల్ గూడ జైలు ప్రిజన్ డీజీ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. తాను కూడా జైలు జీవితం గడిపానని, జైలు మనిషినే అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఖైదీల సమస్యలు తనకు కూడా తెలుసన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జైలుకు వెళ్లానని తెలిపారు. ముషీరాబాద్ జైలుకు సుమారు 50 నుంచి 60 సార్లు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు.

నాయిని

నాయిని

ఖైదీల్లో ప్రవర్తన మారే విధంగా జైళ్లు ఉండాలన్నారు. జైళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జైళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

 నాయిని

నాయిని

ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

 నాయిని

నాయిని

జీవితంలో తొందరపడి తప్పు చేసి జైలుకు వచ్చిన వారిలో మార్పు తీసుకురావాలన్నారు. జైళ్లలో ఖైదీలకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 నాయిని

నాయిని

జైళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఇప్పిస్తానని హామీనిచ్చారు. దేశంలో కన్నా దక్షిణాదిన తమ రాష్ట్రం ముందుండేలా పని చేయాలని సూచించారు.

 నాయిని

నాయిని

తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లను అవినీతిరహితంగా మార్చామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. దేశానికే తెలంగాణ జైళ్లు ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

 నాయిని

నాయిని

ఖైదీల సమస్యలు తనకు కూడా తెలుసన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపానని గుర్తు చేశారు.

 నాయిని

నాయిని

తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జైలుకు వెళ్లానని తెలిపారు. ముషీరాబాద్ జైలుకు సుమారు 50 నుంచి 60 సార్లు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు.

English summary
Home Minister Nayini Narsimha Reddy in Chanchalguda jail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X