హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లలిత్ హత్య కేసు: భార్యకు అబార్షన్, అందుకే మర్మాంగాలు కోసి చంపారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వనస్థలిపురం, సచివాలయనగర్‌ కాలనీలో నివసిస్తున్న లలిత్‌ ఆదిత్య(26) అనే వ్యక్తిని గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కొందరు అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వివాహం చేసుకున్న లలిత్ హత్య వెనుక భార్య కుటుంబం హస్తం ఉందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.

వనస్థలిపురం, సచివాలయనగర్‌ కాలనీలో నివసిస్తున్న లలిత్‌ ఆదిత్య(26) నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశాడు. హస్తినాపురానికి చెందిన సుస్మితారెడ్డిని 2015 నవంబరులో ద్వారకా తిరుమలలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో గత కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది.

ఇదే క్రమంలో సుస్మితారెడ్డి గర్భవతి అయింది. భర్తకు తెలియకుండా ఆమె కుటుంబ సభ్యులు అబార్షన్‌ చేయించారు. ఈ విషయం తెలుసుకుని ఆగ్రహం చెందిన లలిత్ గుజరాత్ నుంచి వచ్చిన తన ఇద్దరు స్నేహితులు విష్ణు, ప్రకాశ్‌తో కలిసి హయతనగర్‌ మండలం రాగన్నగూడలో మామ ఇంటికెళ్లి ఫర్నిచర్‌ ధ్వంసం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొనడంతో లలిత్‌పై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 సుస్మితారెడ్డి, భర్త లలిత్‌కు మధ్య గొడవ

సుస్మితారెడ్డి, భర్త లలిత్‌కు మధ్య గొడవ


ఇదే విషయమై సుస్మితారెడ్డి, భర్త లలిత్‌కు మధ్య బుధవారం గొడవ జరగగా సాయంత్రం నాలుగు గంటలకు ఆమె పుట్టింటికి వెళ్లింది. చెల్లెలి రాకతో ఆగ్రహాం చెందిన సోదరులు యశ్వంత్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మరో ఇద్దరు గురువారం 3.30 గంటల ప్రాంతంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న టాటా సుమోలో లలిత్‌పై దాడి చేసేందుకు వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న అతడిని బయటకు లాక్కొచ్చి అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి మర్మాంగాలను కోసి చంపేశారు.

 పూలకుండీలతో దారుణంగా కొట్టారు

పూలకుండీలతో దారుణంగా కొట్టారు

అనంతరం పక్కనే ఉన్న పూలకుండీలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో లలిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికుల సమాచారంతో ఎల్‌బీనగర్‌ డీసీపీ తఫ్సీర్‌ ఇక్భాల్‌, వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్‌, ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, నరేందర్‌గౌడ్‌ సంఘటన స్థలానికెళ్లి వివరాలు సేకరించారు.

 సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు

సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు


ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య అంతా ఏఎస్‌ఐ మోహిన్‌ షరీఫ్‌ కళ్లెదుటే జరిగడం విశేషం. షరీఫ్‌.. లలిత్ ఆదిత్య ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకు ఉంటున్నారు. గోడవ సమయంలో లలిత్ కేకలు విన్న ఆయన బయటకు వచ్చి వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.

 లలిత్‌తో పాటు రాహుల్‌ అనే వ్యక్తిపై కూడా దాడి

లలిత్‌తో పాటు రాహుల్‌ అనే వ్యక్తిపై కూడా దాడి


లలిత్‌తో పాటు రూమ్‌లో ఉంటున్న రాహుల్‌ అనే వ్యక్తిపై కూడా దాడికి యత్నించారు. భయభ్రాంతులకు గురైన అతడు బాతరూమ్‌లోకెళ్లి గడియపెట్టుకున్నాడు. ఒక్క ఫేస్‌బుక్ పోస్ట్ లలిత్ హత్యకు దారి తీసిందని అంటున్నారు. సుస్మితారెడ్డికి అబార్షన్‌ చేయించిన విషయం తెలుసుకున్న లలిత్, నాలుగు నెలల క్రితం సుస్మితారెడ్డి అన్న యశ్వంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి హెచ్చరించాడు. కుటుంబ సభ్యులను దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. వనస్థలిపురం వచ్చాక మిమ్మల్ని చంపేస్తానన్నాడు. దీంతో పథకం ప్రకారం సుస్మితా కుటుంబ సభ్యులే లలిత్‌ను హత్య చేయించారు.

English summary
In a heinous incident, a software engineer was hacked to death allegedly by his in-laws at Sachivalaya Nagar in Vanasthalipuram, here. Police suspect that it could be honour killing by victim's in-laws, who hired killers to eliminate their son-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X