వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై 'ఆంధ్రా' కుట్ర: పవన్ కళ్యాణ్‌పై విమర్శలు సరే.. వీటి మాటేమిటి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సిపిఎం నేతలు కలవడం చర్చనీయాంశమయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో మాట్లాడని పవన్ కళ్యాణ్, తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం 'ఆంధ్రా' రాజకీయ కుట్రలకు తెరలేపుతోందనే విమర్శలు వస్తున్నా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సిపిఎం నేతలు కలవడం చర్చనీయాంశమయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో మాట్లాడని పవన్ కళ్యాణ్, తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం 'ఆంధ్రా' రాజకీయ కుట్రలకు తెరలేపుతోందనే విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణలో 'ఆంధ్ర' రాజకీయ 'కుట్ర': పవన్‌తో తమ్మినేని చర్చలపై అనుమానాలు!తెలంగాణలో 'ఆంధ్ర' రాజకీయ 'కుట్ర': పవన్‌తో తమ్మినేని చర్చలపై అనుమానాలు!

పవన్ కళ్యాణ్‌ను లేదా సిపిఎంను నిలదీసే వారు ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సి ఉందని అంటున్నారు. తొలుత కేసీఆర్ కేబినెట్లోనే తెలంగాణను వ్యతిరేకించిన వారు మంత్రులుగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణకి వ్యతిరేకి ఎలా అవుతారు

పవన్ కళ్యాణ్ తెలంగాణకి వ్యతిరేకి ఎలా అవుతారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి ఎలా అవుతారో చెప్పాలని కొందరు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ పార్టీని స్థాపించలేదని, ఆయన రాజకీయ నాయకుడు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు.

ప్రజారాజ్యం పార్టీ నేతగా..

ప్రజారాజ్యం పార్టీ నేతగా..

అంతకుముందు, 2007లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంకు యువరాజ్యం అనుబంధంగా ఉండేది. దానికి చీఫ్‌గా ఉన్నప్పటికీ.. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడంతోనే పవన్ రాజకీయంగా పక్కకు జరిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించారు.

సినీ పరిశ్రమ నుంచి..

సినీ పరిశ్రమ నుంచి..

తెలంగాణ ఉద్యమంలో పలు వర్గాలు, సంఘాలు పాల్గొన్నాయి. అదే సమయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన కొందరు దీనికి దూరంగా ఉన్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు మినహా.. ఎవరూ తెలంగాణ లేదా సమైక్యాంధ్ర ఉద్యమాలపై స్పందించలేదు. కాబట్టి పవన్‌ను తప్పుబట్టడంలో అర్థం లేదని అంటున్నారు.

విడ్డూరమే

విడ్డూరమే

విభజన జరిగినప్పుడు బాధలో తాను వారం రోజుల పాటు భోజనం చేయలేదని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పారు. దీనిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అంటున్నారు. ఓ ప్రాంతంతో అనుబంధాన్ని తెంచుకోవడం చాలా కష్టం. హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన బాధపడ్డానని చెప్పారే గానీ, అలా అనడం తెలంగాణను వ్యతిరేకించడం కాదనే విషయం తెలుసుకోకపోవడం విడ్డూరమంటున్నారు.

మరి వీరిమాటేమిటి?

మరి వీరిమాటేమిటి?

తెలంగాణ ఉద్యమం సమయంలో పవన్ కనీసం మాట్లాడలేదు. సీపీఎం వ్యతిరేకించింది. మరి ఇప్పుడు కేబినెట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, నామా నాగేశ్వర రావు, అలాగే తెరాస కీలక నేతగా ఉన్న డీ శ్రీనివాస్ వంటి వారి మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. వీరిలాగే సీపీఎం కూడా వ్యతిరేకించిందని, అలాగే చాలామందిలాగే పవన్ మౌనంగా ఉన్నారని అంటున్నారు.

తెలంగాణపై ఆంధ్రా కుట్ర అని ఎలా అంటారు?

తెలంగాణపై ఆంధ్రా కుట్ర అని ఎలా అంటారు?

సిపిఎంలో ఓ వర్గానికే అత్యున్నత పదవులు ఇస్తూ వెళ్తుంటే దానిని ప్రశ్నించడంలో అర్థం ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్‌ను ఓ ప్రాంతానికి చెందిన వాడిగా చెప్పడం సరికాదంటున్నారు.

తెలంగాణకు అనుకూలంగా పవన్ ఇలా..

తెలంగాణకు అనుకూలంగా పవన్ ఇలా..

విభజన సమయంలో అన్నం తినలేదని చెప్పిన అదే పవన్ కళ్యాణ్.. పలు సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన విషయాలు మరిచిపోయారా అంటున్నారు. సెక్షన్ 8పై ఎంత పెద్ద చర్చ జరిగిందో అందరికి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సెక్షన్ 8 అంటే తెలంగాణ వారు పోరాడి సాధించుకున్న తెలంగాణకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. నాలుగు రోజుల క్రితమే.. ఏపీతో పోలిస్తే తెలంగాణ రైతులకు కేంద్రం తక్కువ పరిధిలో మిర్చి కొనుగోలుకు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతోందని, చేతల్లో మాత్రం ఏం చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ విపక్షాల్లో సరైన లీడర్ లేరు. దీంతో తెరాసకు ఎదురు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీలతో పాటు కలిసి వచ్చే వారితో ప్రజల కోసం ప్రశ్నిస్తామంటే తప్పేమిటని అంటున్నారు.

English summary
How Jana Sena chief Pawan Kalyan is against to Telangana?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X