వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22ఏళ్లు చిక్కకుండా!: పాపిలాన్ టెక్నాలజీతో పోలీసులతో అతన్ని పట్టేశారు..

రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన హబీబ్‌ అలియాస్‌ చోటు(35) చిన్న తనం నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పాపిలాన్‌ టెక్నాలజీ ద్వారా 22ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని సైబరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పాపిలాన్ టెక్నాలజీ ద్వారా నిందితుడు గతంలో 26చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నట్లు గుర్తించారు.

రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన హబీబ్‌ అలియాస్‌ చోటు(35) చిన్న తనం నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు.1995లో సంజయ్‌, సర్వర్‌, హర్షద్‌లతో కలిసి చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో అతను మైనర్‌ కావడంతో జువెనైల్‌ హోంకు తరలించారు.

hyd police arrests habib who involved in 26theft cases

అక్కడి నుంచి బయటకొచ్చాక కూడా అతని తీరులో మార్పు రాలేదు. గతేడాది మీర్‌పేట ఠాణా పరిధిలో ఓ చోరీ కేసులో హబీబ్‌ అరెస్టయినా.. 1995నాటి వేలిముద్రలతో నిందితుడి వేలిముద్రలను పోల్చడం సాధ్యపడలేదు. అప్పటికీ పాపిలాన్ వంటి టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో.. హబీబ్ తప్పించుకోగలిగాడు.

కానీ తాజాగా మరో చోరీ కేసులో హబీబ్ అరెస్టవడంతో.. ఈసారి మాత్రం శిక్ష తప్పలేదు. అందుబాటులో ఉన్న పాపిలాన్ టెక్నాలజీ ద్వారా.. పాత నేరాల్లో నమోదైన అతని వేలిముద్రలను సరిపోల్చగలిగారు. దీంతో నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై మొత్తం 26కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతని నుంచి రూ.30 లక్షల విలువైన కేజీ బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, తాజా పాపిలాన్ టెక్నాలజీతో గతంలో సేకరించిన వేలిముద్రలతోపాటు తాజాగా సేకరిస్తున్న అనుమానితుల వేలిముద్రలను ఫింగర్‌ప్రింట్స్ బ్యూరో డేటా బేసులో భద్రపరుస్తున్నారు. ఈ బ్యూరో లైవ్ స్కానర్‌కు అనుసంధానించడంతో ఎక్కడినుంచైనా అనుమానితుల వేలి ముద్రలను సేకరించినప్పుడు పాత నేరస్థులైతే వెంటనే తెలిసిపోతుంది.

English summary
Rachakonda Police arrested Habib, Who involved in 26 theft cases in the city. To held him police used the papillon technology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X