హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటోల నయా దందా: హారన్ మోగిందా.. మీ పని గోవిందా! కొట్టినప్పుడల్లా రూ.1.10 మటాష్!!

మీరు ఆటో ఎక్కినప్పుడు.. వెళ్లే మార్గంలో పెద్దగా వాహనాలు ఏమీ లేకపోయినా సరే, మీ ఆటో డ్రైవర్‌ పదే పదే హారన్‌ మోగిస్తుంటే గనుక అనుమానించండి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో మీరు ఆటోలో ఎక్కారనుకోండి. మీరు వెళ్లే మార్గంలో పెద్దగా వాహనాలు ఏమీ ఉండవు. అయినా సరే, మీ ఆటో డ్రైవర్‌ పదే పదే హారన్‌ మోగిస్తుంటాడు. అది చూసి అతను ఎంతో అప్రమత్తంగా ఉన్నాడని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.

మీకు తెలియని విషయం ఏమిటంటే.. మీ ఆటో డ్రైవర్ ఎన్నిసార్లు హారన్‌ మోగిస్తే అన్ని సార్లు మీటర్‌ ఛార్జీ పెరుగుతూ ఉండడం. ఒక్కో మోతకు రూ.1.10పైసలు. ఇదే మోసాన్ని వివిధ రకాలుగా చేసేవారూ ఉన్నారు.

కొందరు హారన్‌కు, మరికొందరు ఇండికేటర్లు, ముందు లైట్లకు మీటరును అనుసంధానం చేసి.. వాటిని ఉపయోగించినప్పుడల్లా ఛార్జీ పెరిగేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.

Hyderabad: 80 per cent autorickshaw meters tampered

తాజాగా తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో ఇటువంటి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జంట నగరాల పరిధిలో పలువురు ఆటో యజమానులు నయా దందాకు తెరలేపారు. మూడు రకాలుగా మీటరును హ్యాక్‌ చేస్తూ ప్రయాణికుల జేబుకు చిల్లుపెడుతున్నారు.

'గ్రేటర్‌లో సుమారు లక్షన్నర వరకు ఆటోలు ఉన్నాయి. నగర రవాణా వ్యవస్థలో మూడు శాతం వాటా వీటిదే. రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో 9.5 శాతం మంది ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు చోదకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మీటర్లను వేర్వేరు రకాలుగా టాంపరింగ్‌ చేస్తున్నారు.''అని ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కృష్ణ తెలిపారు.

శుక్రవారం ఒక్కరోజే నెక్లస్‌ రోడ్డులో 22 ఆటోలపై ఈ మేరకు కేసులు నమోదు చేశారు. గ్రేటర్‌ వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేపడితే 54 ఆటోలు ఇలా పోలీసులకు దొరికి పోయాయి.

ఏం చేస్తున్నారంటే..

మూడురకాల టాంపరింగ్‌లో కండెన్సర్‌ ప్రధానమైంది. దానిని మీటరు నుంచి హారన్‌ బోర్డుకు అనుసంధానిస్తున్నారు. మీటరు వేశాక హారన్‌ మోగించినప్పుడల్లా అన్ని సార్లు రూ.1.10 పైసలు చొప్పున రుసుము పెరుగుతుంది. ఇదే విధంగా మీటరును ఇండికేటర్‌ బాక్సుకు, లైటింగ్‌ స్విచ్ కు జత చేస్తున్నారు. అవసరం లేకపోయినా వీటిని వినియోగించడాన్ని బట్టి అనుమానించాల్సిందే. ప్రతి ఆటోకు తప్పనిసరిగా మీటరు ఉండాలని, దానికి తూనికలు, కొలతల శాఖ ధ్రువీకరించిన సీలు తప్పనిసరని ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కృష్ణ తెలిపారు.

ఇలా గుర్తుపట్టొచ్చు...

ప్రస్తుతం జంట నగరాల పరిధిలో ఆటో కనీస రుసుము రూ.20. మొదటి 1.6 కిలోమీటర్ల తర్వాత ప్రతి కిలోమీటరుకు ఆ మొత్తం రూ.1.10 చొప్పున పెరుగుతుంటుంది. అంటే 1.6 కి.మీ దాటగానే ఆటో ఛార్జి రూ.21.10, అలానే 1.7 కి.మీలకు రూ.22.20. గమ్యం చేరగానే మీటరులో చూసి ప్రయాణించిన దూరాన్ని, చెల్లించాల్సిన మొత్తాన్ని బేరీజు వేస్తే అది చూపించే రుసుము సరైనదో కాదో తెలుస్తుంది.

English summary
You are likely to be taken for a ride, eight out of every 10 times that you choose to hire an autorickshaw in Hyderabad. The police have discovered that 80 per cent of autos in the city have tampered meters that can send your pulse racing with the jumps in tariff. Ironically, the police had introduced digital meters three years ago, claiming they were tamper-proof. The drivers' weapon is a horn switch, light switch, are any other switch under their seat that is connected to the meter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X