రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?
డ్రగ్ కేసులో నటుడు రవితేజను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) శుక్రవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా గురించి సిట్ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి?
హైదరాబాద్: డ్రగ్ కేసులో నటుడు రవితేజను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) శుక్రవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా గురించి సిట్ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి?
సంచలన మలుపు: ఒకే అపార్టుమెంట్లో చార్మీ-కమింగా? మరిన్ని షాకింగ్ విషయాలు
రవితేజ డ్రగ్స్ తీసుకున్నారా లేక అమ్మారా? అనే చర్చ సాగుతోంది. ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా జరిగిన ఏడుగురు సినీ స్టార్స్ విచారణ ఒక ఎత్తు, రవితేజ విచారణ మరో ఎత్తు.
శుక్రవారం రవితేజ విచారణ.. సిట్ వద్ద ఏముంది
ముమైత్ ఖాన్ విచారణ అనంతరం సిట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో ముమైత్ ఖాన్ విచారణ అంశాలతో పాటు రేపు (శుక్రవారం) రవిశంకర్ రాజు భూపతి రాజు అలియాస్ రవితేజను విచారించనున్నట్లు పేర్కొంది. స్టార్ హీరో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి సిట్ కార్యాలయం వైపు ఉంది. సిట్ వద్ద రవితేజకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయనే చర్చ సాగుతోంది. రవితేజపై వేసే ప్రశ్నలు ఏమిటనే ఉత్కంఠ ఆయన అభిమానుల్లోను ఉంది.
అభిమానులు వచ్చే అవకాశం
రవితేజకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సిట్ కార్యాలయం వద్దకు తరలి వచ్చే అవకాశముంది. చార్మీ, ముమైత్ వంటి వారు వచ్చినప్పుడే చాలామంది వచ్చారు. ఇప్పుడు రవితేజ విచారణ నేపథ్యంలో చాలామంది వచ్చే అవకాశముంది.
డ్రగ్ ముఠాతో రవితేజకు పరిచయం ఎలా?
రవితేజకు డ్రగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే చర్చనే ఇప్పుడు అంతటా సాగుతోంది. డ్రగ్ రాకెట్లో అరెస్టయిన జీషన్ అలీ.. తాను రవితేజకు డ్రగ్స్ ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడించాడని చెబుతున్నారు. జీషన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునే వాడని సిట్ గుర్తించిందని సమాచారం.
ఏవిధమైన సమాధానాలు చెబుతాడు?
రవితేజ గురించి సిట్ వద్ద ఏం సమాచారం ఉంది, ఆధారాలతో సిట్ విచారిస్తే రవితేజ ఏం సమాధానాలు చెబుతాడనే చర్చ సాగుతోంది. డ్రగ్ కేసును తరిచి చూస్తుంటే రవితేజ చుట్టు ఉచ్చు బిగుస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిట్ ముుందు హాజరవుతున్న నేపథ్యంలో రవితేజ గురువారం మధ్యాహ్నం నుంచి లాయర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలుస్తోంది.
రవితేజ విషయంలో ఆసక్తికర విషయాలు
రవితేజకు నోటీసులు ఇవ్వడానికి కారణం.. జీషన్ అతని పేరు చెప్పడం ఓ కారణం, కెల్విన్ మొబైల్లో రవితేజ నెంబర్ ఉండటం అని చెబుతున్నారు. రవితేజకు కెల్విన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందని ప్రచారం సాగుతోంది. రవితేజకు కెల్విన్‌ను జీషన్ పరిచయం చేశాడని భావిస్తున్నారు.
జీషన్‌తో ఆరేళ్ల పరిచయం
రవితేజకు తాను డ్రగ్స్ సరఫరా చేశానని జీషన్ విచారణలో వెల్లడించారని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఆరేళ్ల పరిచయం ఉందని సిట్ గుర్తించిందని తెలుస్తోంది. కెల్విన్ తదితరులతో రవితేజ సెల్ఫీలు దిగిన ఆధారాలు కూడా ఉన్నాయని సమాచారం.
సంబంధం ఏమిటి?
ఈ నేపథ్యంలో కెల్విన్ ముఠాతో సంబంధం ఏమిటి? డ్రగ్ తీసుకుంటారా? ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? కెల్విన్‌కు ముందు ఎవరితోనైనా పరిచయం ఉందా? విదేశాలకు వెళ్లే సమయంలో అక్కడ ఏం చేస్తారు? తదితర ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.