హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీని దోచిన ఏటీఎం దొంగ దొరికాడిలా,వ్యక్తి సాహసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యూసఫ్ గూడ ఏటీఎంలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న యువతిని తుపాకీతో బెదిరించి దోపిడీ చేసిన ఘటనలో నిందితుడు శివకుమార్ రెడ్డిని పోలీసులు చూసి పారిపోతుండగా పట్టుకోవడంలో యాదగిరి అనే యువకుడు సాహసం ప్రదర్శించాడు.

మధురానగర్లోని సాయి దుర్గా హాస్టల్లో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడి కోసం సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ లాకర్ తెరిచేందుకు ప్రయత్నించారు. దానిని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో భయపడిన నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.

అతడే దొంగ అని నిర్ధారించుకున్న పోలీసులు పట్టుకోవాలని పైనుంచి కేకలు వేశారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తూ అక్కడే ఉన్న యాదగిరి.. గోడ దూకి శివకుమార్ రెడ్డి వెంటబడ్డాడు. తన వద్ద తుపాకీ ఉందని, కాలుస్తానని చెప్పినా యాదగిరి వదలలేదు. పెనుగులాటలో ఇద్దరూ కిందపడ్డారు. పోలీసులు వచ్చి నిందితుడు శివకుమార్ రెడ్డిని పట్టుకున్నారు. సాహసం ప్రదర్శించిన యాదగిరికి పోలీసులు బహుమతి ఇవ్వనున్నారు.

 ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ ఎస్‌బీఐ ఏటీఎంలో కాల్పుల కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఆ వివరాలను హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు వివరించారు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

మూడేళ్ల క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చిన శివకుమార్ రెడ్డి అనే యువకుడు విలాసాలకు మరిగి దోపిడీలకు పాల్పడ్డాడు. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. యువతిని భయపెట్టేందుకు తుపాకితో పక్కకు కాల్సాడని ఆయన చెప్పారు.

 ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని కడప జిల్లా వల్లు గ్రామానికి చెందిన శివకుమార్‌రెడ్డిగా గుర్తించారు. అతని నుంచి ఒక నాటు తుపాకీ, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం యూసుఫ్‌గూడలోని శ్రీలలిత అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణిని నగదు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లింది. ఆమె డబ్బు డ్రా చేస్తుండగా శివకుమార్‌ ఏటీఎంలోకి వెళ్లాడు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

తుపాకీ చూపించి నగదు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. కాల్పులు జరిపాడు. ఆమె నుంచి కార్డు, పిన్‌ నెంబర్‌ కూడా తీసుకుని పరారయ్యాడు. సీసీ కెమెరా పుటేజ్‌ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు గురువారం అమీర్‌పేట్‌లో అరెస్టు చేశారు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

నిందితుడి వివరాలను నగర సీపీ మహేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పదోతరగతి ఫెయిల్‌ అయిన శివకుమార్‌ మూడేళ్ల క్రితం కడప నుంచి హైదరాబాద్‌ వచ్చాడని, చెడు వ్యసనాలకు బానిస అయిన ఆయన డబ్బు కోసం నేరాల వృత్తి ఎంచుకున్నాడని తెలిపారు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ


ఇందుకోసం మహారాష్ట్ర గ్యాంగ్‌ వద్ద రూ. 25 వేలకు నాటు తుపాకీని కొనుగోలు చేశాడని, దాని సాయంతోనే ఏటీఎంలో మహిళను బెదిరించాడని కమిషనర్‌ తెలిపారు. శివకుమార్‌ చెప్పిన వివరాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి చెప్పారు. ఏటీఎం కేసును సీరియస్‌గా తీసుకుని ఛేదించామని, 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఆయన చెప్పారు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

సాఫ్టువేర్ ఉద్యోగిణిని బెదిరించడం నుండి డెబిట్ కార్డును తీసుకోవడం వరకూ దొంగ ఏటీఎం కేంద్రంలో ఐదు నిమిషాలో గడిపాడు. బుధవారం ఉదయం 7.13 గంటలకు లోపలకు వెళ్లిన దొంగ.. శ్రీలలితను బెదిరించి చెవిదుద్దులు, మెడలో హారం తీసుకున్నాడు. డెబిట్ కార్డు లాక్కొని, పిన్ నెంబర్ తీసుకొని 7.18 నిమిషాలకు బయటకు వచ్చాడు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ


చదువుకున్న వాడిగానే కనిపించాడని, ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో స్వరాన్ని గుర్తుంచుకోలేదని శ్రీలలిత పోలీసులకు తెలిపింది. దీంతో ఏటీఎంపై అవగాహన ున్న దొంగ పరికర ప్రాంతాల్లోనే ఉంటాడన్న కోణంలో పోలీసులు వేట సాగించి, విజయవంతమయ్యారు.

ఏటీఎం దొంగ

ఏటీఎం దొంగ

ఘటనా స్థలంలో దొరికిన లెడ్ ఆధారంగా తూటా ఏ తుపాకీకి చెందినదనే కోణంలో పోలీసులు వివరాలు సేకరించారు. శ్రీలలిత సిమ్ కార్డు తీసుకెళ్లిన శివ కుమార్ రెడ్డి తన ఫోన్లో వేయడంతో దొరికిపోయాడు. దీంతో పాటు అతడు రూ.3500 తీసుకున్న సారథి స్టూడియో సమీపంలోని ఏటీఎంను గుర్తించారు.

English summary
A man who confronted a woman at an ATM in Hyderabad where he shot a bullet at a wall before escaping with her jewellery and ATM card yesterday has been arrested from the same neighbourhood. Three of his accomplices were also arrested; weapons and bullets have been recovered from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X