హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్రెండ్లీ పోలీసింగ్‌: హైదరాబాద్ పిఎస్‌లకు ఫేస్‌బుక్‌ ఖాతా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఇప్పటివరకు సైబర్‌ క్రైం విభాగానికి మాత్రమే ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఇప్పుడు అన్ని పోలీస్‌స్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలతో పాటు 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌ స్వాతిలక్రాతో కలిసి మంగళవారం ఖాతాలను ప్రారంభించారు.

ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ అని ఐడీని టైపు చేస్తే నగరంలో అన్ని ఠాణాల పేర్లతో ఖాతాలు కనిపిస్తాయి. వీటిని ప్రారంభించిన అనంతరం అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. అసోంలోని గౌహతిలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్మార్ట్‌ పోలీసింగ్‌ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని పోలీసుస్టేషన్లకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తెరిచామన్నారు.

ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, తిష్ఠవేసిన అనుమానితుల గురించి ఇందులో తెలియజేయవచ్చన్నారు. పోలీసు పరంగా ఉన్న సమస్యలతో పాటు, సూచనలు, సలహాలకు సంబంధించి ఇందులో పోస్ట్‌లు చేయవచ్చన్నారు. ఫిర్యాదులను ఫేస్‌బుక్‌లో తీసుకునే అంశాన్ని మాత్రం త్వరలో పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని మండలాల ఉపకమిషనర్లు పాల్గొన్నారు.

ఠాణాలకు ఫేస్‌బుక్

ఠాణాలకు ఫేస్‌బుక్

పోలీసు శాఖలో ఇప్పటివరకు సైబర్‌ క్రైం విభాగానికి మాత్రమే ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఇప్పుడు అన్ని పోలీస్‌స్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది.

ఠాణాలకు ఫేస్‌బుక్

ఠాణాలకు ఫేస్‌బుక్

నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలతో పాటు 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు.

ఠాణాలకు ఫేస్‌బుక్

ఠాణాలకు ఫేస్‌బుక్

బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌ స్వాతిలక్రాతో కలిసి మంగళవారం ఖాతాలను ప్రారంభించారు.

ఠాణాలకు ఫేస్‌బుక్

ఠాణాలకు ఫేస్‌బుక్

ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ అని ఐడీని టైపు చేస్తే నగరంలో అన్ని ఠాణాల పేర్లతో ఖాతాలు కనిపిస్తాయి.

ఠాణాలకు ఫేస్‌బుక్

ఠాణాలకు ఫేస్‌బుక్

వీటిని ప్రారంభించిన అనంతరం అనురాగ్‌శర్మ మాట్లాడుతూ.. అసోంలోని గౌహతిలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన డీజీపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్మార్ట్‌ పోలీసింగ్‌ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని పోలీసుస్టేషన్లకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తెరిచామన్నారు.

English summary
As part of its citizen friendly policing, the Hyderabad police has opted for technology to reach out to citizens. Every police station in Hyderabad has now ope-ned its Facebook page, where it can interact, respond and take suggestions from citizens in their limits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X