హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ శక్తివంత నగరాలివే..: బెంగళూరు ఫస్ట్, 5వ స్థానంలో హైదరాబాద్, కేటీఆర్ హ్యాపీ

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయిదో స్థానంలో నిలిచింది. కర్నాటక రాజధాని బెంగళూరు ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయిదో స్థానంలో నిలిచింది. కర్నాటక రాజధాని బెంగళూరు ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది.

ప్రపంచంలో శక్తివంతమైన నగరాల జాబితాను వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ప్రకటించింది. హైదరాబాద్ అయిదో స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

మొదటి 10 స్థానాల్లో హైదరాబాద్‌ ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం ఆనందకరమన్నారు.

hyderabad

ప్రపంచంలో పది శక్తిమంతమైన నగరాలు ఇవే..

1. బెంగళూరు (భారత్)
2. హో చి మిన్ సిటీ (వియత్నాం)
3. సిలికాన్ వ్యాలీ (యూఎస్ఏ)
4. షాంఘై (చైనా)
5. హైదరాబాద్ (భారత్)
6. లండన్ (యూకే)
7. ఆస్టిన్ (యూఎస్ఏ)
8. హనోయి (వియత్నాం)
9. బోస్టన్ (యూఎస్ఏ)
10. నైరోబీ (కెన్యా)

ఇదిలా ఉండగా, భారత్‌లో టాప్ 30లో కొన్ని నగరాలు చోటు దక్కించుకున్నాయి. పుణే 13వ స్థానం, చెన్నై 17వ స్థానం, ఢిల్లీ 23వ స్థానం, ముంబై 25వ స్థానం దక్కించుకున్నాయి.

కాగా, జనాభా, విద్య, టెక్నాలజీ, కనెక్టివిటీ, ఆర్థిక పురోగతి, కార్పొరేట్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ ఆధారంగా జాబితా రూపొందింది. ఈ జాబితా ప్రకారం బోస్టన్, ఆస్టిన్, లండన్ నగరాలను వెనక్కి నెట్టి సిలికాన్ వ్యాలీ, షాంఘై తర్వాత హైదరాబాద్ అయిదో స్థానంలో నిలిచింది.

English summary
Hyderabad in top ten in the most dynamic cities in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X