వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నేను ముఖ్యమంత్రిని అవుతా, ఎప్పుడనేది చెప్పలేను, కెసిఆర్ పై ఇలా

తాను ముఖ్యమంత్రిని అయ్యేది ఖాయమని , కానీ, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానో చెప్పలేనని సిఎల్ పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర న

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ:తాను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయనమని, కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానో చెప్పలేనని సిఎల్ పి ఉపనేత , నల్గొండ ఎంఏల్ఏ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

నల్గొండ జిల్లా కనగల్ లో ఆయన పలు కార్యక్రమాల్లో ఆయన శనివారం నాడు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు.

తెలంగాణలో 90 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకొంటామని ఆయన చెప్పారు.

komati reddy venkat reddy

ముఖ్యమంత్రి కెసిఆర్ ను చూస్తోంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తుకు వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంట్ తో పబ్బం గడుపుకొంటున్నారని ఆయన కెసిఆర్ పై మండిపడ్డారు.

ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవంటూనే ప్రసార సాధనాల్లో తన గురించి ప్రచారం చేసుకొనేందుకుగాను రూ.940 కోట్లను ఖర్చు చేశారని ఆయన దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తోన్న పాలన తీరును ఎండగట్టేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి కెసిఆర్ మోసాలను ఎండగట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.

English summary
i will be chief minister as a cm of Telangana state said CLP deputy leader Komati reddy venkat reddy.Congress party will win 90 MLA seats in 2019 he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X