వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాది ట్రయాంగిల్ లవ్, ఓటుకు నోటు కేసు కుట్రే, ఎర్రబెల్లిది కోవర్ట్ ఆపరేషన్: రేవంత్

తనకు బిజెపిలో చేరాల్సిన అవసరం లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే బిజెపిలో ఉన్న పార్టీ నాయకుల పరిస్థితి చూస్తే ఇదే విషయం అర్ధమౌతోందన్నారు. తమకు ,బిజెపికి మధ్య ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనకు బిజెపిలో చేరాల్సిన అవసరం లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే బిజెపిలో ఉన్న పార్టీ నాయకుల పరిస్థితి చూస్తే ఇదే విషయం అర్ధమౌతోందన్నారు. తమకు ,బిజెపికి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ సాగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు.మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పార్టీలోకి వస్తే సాదారంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందనే విషయాన్ని కోర్టులో వివరించనున్నట్టు చెప్పారు.

తెలుగు న్యూస్ ఛానల్ ఎన్ టీవికి ఇచ్చిన ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణలో బిజెపి, టిడిపిల మధ్య నెలకొన్న స్నేహబందంతో పాటు ఇతర అంశాలను కూడ ఆయన ప్రస్తావించారు.

స్థానిక సమస్యల ఆధారంగా ఆయా పార్టీలతో పొత్తు విషయాలు ఉంటాయన్నారు.అంతేకాదు అదే సమయంలో బిజెపితో పొత్తు విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, చంద్రబాబునాయుడు కూర్చొని నిర్ణయిస్తారని చెప్పారు.

కెసిఆర్ కు ఊడిగం చేసే నాయకులంటే ఆయనకు ఇష్టం. కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో కెసిఆర్ కు అనుకూలంగా పనిచేసే నాయకులున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఆయా పార్టీలు టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటున్నాయని చెప్పారు. బిజెపి నాయకులు ఏ మేరకు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో చెప్పాలని ఆయన కోరారు.బిజెపిని బలోపేతం చేసే కార్యాచరణ ఆ పార్టీకి లేదన్నారు.

బిజెపికి అంత సీన్ లేదు

బిజెపికి అంత సీన్ లేదు

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే కార్యాచరణను బిజెపి రాష్ట్ర నాయకత్వం చేయడం లేదని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.అంతేకాదు ఆ పార్టీలో చాలామంది నాయకులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే కార్యాచరణ ఆ పార్టీ నాయకత్వానికే లేదన్నారు.మరో వైపు వివిద పార్టీలకు చెందిన ప్రజాధరణ నాయకులు బిజెపిలో చేరితే ఆ పార్టీ ఏ మేరకు ఆ నాయకులను ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ప్రాజెక్టుల్లో అవినీతితో పాటు కెసిఆర్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడుతున్న నాగం జనార్ధన్ రెడ్డి, టిడిపి నుండి బయటకు వె్ళిన సంకినేని వెంకటేశ్వర్ రావు, గండ్ర సత్యనారాయణరావు , యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నాయకుల పరిస్థితి బిజెపిలో ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. అయితే తనకు బిజెపిలో చేరాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి.మరో వైపు ఎన్నికలకు ముందే బిజెపితో కలిసి తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు.అయితే అలాంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు

మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ

మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, టిడిపిలది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. తాము బిజెపితో పొత్తు కోరుకొంటున్నామన్నారు.అయితే బిజెపి నాయకులు మాత్రం టిఆర్ఎస్ తో పొత్తును కోరుకొంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అందుకే తెలంగాణలో బిజెపి,టిడిపి లమధ్య పొత్తు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పారు.అయితే తెలంగాణలో బిజెపికి, టిడిపి నాయకులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. బిజెపి నాయకులు కొందరు కెసిఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ పై ఉన్న సిబిఐ కేసుల గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎర్రబెల్లిది కోవర్ట్ ఆపరేషన్

ఎర్రబెల్లిది కోవర్ట్ ఆపరేషన్

తెలుగుదేశం పార్టీలో ఉంటూ కోవర్ట్ ఆపరేషన్ చేసిన చరిత్ర ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉందన్నారు రేవంత్ రెడ్డి.అయితే ఎర్రబెల్లి కోవర్ట్ ఆపరేషన్ విషయాన్ని పార్టీ గుర్తించిన సందర్భంలో విధిలేక ఎర్రబెల్లి పార్టీని వీడారని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై పార్టీతో విభేదించి నాగం జనార్థన్ రెడ్డి పార్టీని వీడారని ఆయన చెప్పారు.

నాగం జనార్ధన్ రెడ్డికి, ఎర్రబెల్లి పార్టీ వీడిన సందర్భానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో ఇమిడే పరిస్థితి లేకపోతే టిడిపిలోకి రావాలనుకొంటే సాదారంగా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. పార్టీలో చంద్రబాబు తర్వాత నాగం జనార్థన్ రెడ్డి కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బాబుకు అత్యంత సన్నిహితుడుగా కూడ ఉన్నారని చెప్పారు.అయితే నాగం పార్టీలో చేరుతారా లేదా అనే విషయం తనకు తెలియదన్నారు.అయితే బిజెపిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే టిడిపిలో చేరేందుకు నాగం వస్తే సానుకూలంగా సాదరంగా ఆహ్వానిస్తాం. పార్టీలో పూర్వపు స్థానాన్ని కట్టబెడతామన్నారు రేవంత్ రెడ్డి.

ఓటుకు నోటు కేసులో అన్ని విషయాలను కోర్టులో చెబుతా

ఓటుకు నోటు కేసులో అన్ని విషయాలను కోర్టులో చెబుతా

ఓటుకు నోటు కేసులో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది. కుట్ర పన్ని ఈ కేసులో తనను ఎలా ఇరికించిందనే విషయాన్ని కోర్టులో వివరించనున్నట్టు చెప్పారు. అయితే ఈ కేసు వల్లే తాను రాజకీయాల్లో ఉండకూడదన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు.

కెసిఆర్ పై కూడ పాస్ పోర్ట్ కేసులు, ఈఎస్ఐ ఆసుపత్రుల కేసు, సహారా కేసులు కూడ ఉన్నాయనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరో వైపు ఈ కేసు కారణంగానే తాను టిఆర్ఎస్ కు లొంగిపోయాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.అయితే అసెంబ్లీ తమ నోరు నొక్కింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది టిడిపియేనని చెప్పారు.

కెటిఆర్, హారీష్ రావు, జగన్ లతో సిధ్దాంత వైరుధ్యాలే

కెటిఆర్, హారీష్ రావు, జగన్ లతో సిధ్దాంత వైరుధ్యాలే


ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల గురించి తాను మాట్లాడుతానని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ప్రైవేట్ జీవితం గురించి తాను ఏనాడు కామెంట్ చేయలేదని చెప్పారు. వార్తల్లో ఉండేందుకు తాను ఈ రకంగా ఏనాడు మాట్లాడలేదన్నారు. కెటిఆర్, హరీష్ రావులతో సిద్దాంత వైరుధ్యాలేనని చెప్పారు.అయితే వారితో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు రేవంత్ రెడ్డి.మరో వైపు వైసీపీ అధినేత జగన్ తో కూడ తనకు సంబంధాలున్నాయని చెప్పారు.అయితే తమ పార్టీకి జగన్ పార్టీకి సిద్దాంత వైరుధ్యాలున్నాయని చెప్పారు.

రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నం

రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నం

రాష్ట్రంలో రాజకీయపునరేకీకరణకు ప్రయత్నించనున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి.బిజెపి సహా వామపక్షాలు, కోదండరామ్ తో తమతో కలిసివచ్చేవారిని కలుపుకుపోతామన్నారు. తమను కలుపుకొనిపోయేవారితో కలిసిపోనున్నట్టు చెప్పారు.రైతుల కోసం ఉద్యమం చేయడం పట్ల గర్వపడుతున్నట్టు చెప్పారాయన.

రైతులకు ఏపీ ప్రభుత్వం బోనస్ ఇస్తోందన్నారు.కానీ, సినిమాలకు బోనస్ లు ఇస్తున్న ప్రభుత్వం రైతులకు బోనస్ ఇవ్వకుండా కేంద్రంపై నెపం నెట్టడం సరికాదన్నారు రేవంత్ రెడ్డి.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో పొత్తులుంటాయన్నారు.అయితే ఈ పొత్తుల విషయాన్ని పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.

English summary
I won't join in Bjp said Telangana Tdp working president Revanth reddy. Ntv interviewed him on Sunday. he will explain in court about cash for vote case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X