వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుపేదలకు భరోసా: వేలమందికి ఉపాధి కల్పిస్తున్న ఐసీఐసీఐ ఫౌండేషన్

నవంబర్‌,2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 7300మంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఐసీఐసీఐ సంస్థ శిక్షణ అందించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2013నవంబర్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 7300మంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఐసీఐసీఐ సంస్థ శిక్షణ అందించింది. వీరిలో 50శాతం మంది విద్యార్థినిలు ఉండటం విశేషం.

ట్రైనింగ్ మాత్రమే గాక 100శాతం జాబ్ ప్లేస్ మెంట్స్ కల్పిస్తూ ఐసీఐసీఐ సంస్థ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందిస్తోంది. సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు దాదాపు వెయ్యికి పైగా పరిశ్రమలు తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి.

 ICICI Academy for Skills trained over 7300 underprivileged youth in Hyderabad

హైదరాబాద్ లోని ఐసీఐసీఐ ఫౌండేషన్ కార్యాలయంలో సేలింగ్ స్కిల్స్, రిటైల్ సేల్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో నిరుపేద విద్యార్థి విద్యార్థినులకు శిక్షణ అందిస్తున్నారు. సంవత్సరానికి 50బ్యాచ్‌ల చొప్పున వీరు శిక్షణ ఇస్తున్నారు.

సంస్థ ఎండీ చంద్రశేఖర్ కొచ్చర్ మాట్లాడుతూ.. 'దేశ సాంఘీక-ఆర్థిక అభివృద్ది ప్రణాళికలో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలని గుర్తించాం. మానవ వనరులను, ఉపాధి వైపు మళ్లించడానికి ఈ ప్రయత్నం ఫలిస్తుంది' అని పేర్కొన్నారు.

నిరుపేద విద్యార్థులను మాత్రమే గాక ఐసీఐసీఐ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 1,56,000మందికి శిక్షణ అందించినట్లుగా తెలిపారు. మార్చి 2018నాటికి ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా 2.5లక్షల మందికి శిక్షణ అందిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అపోలో ఫార్మసీ, కార్వీ డేటా మేనేజ్ మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, హెచ్.డి.బి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫినిటీ రిటైల్ లిమిటెడ్(క్రోమా-టాటా అనుబంధ సంస్థ), లైఫ్ స్టైల్, జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రై.లి, ట్రెంట్ లిమిటెడ్, పవన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీ హ్యుందాయ్ లాంటి కంపెనీలు తమ ట్రైనీలను రిక్రూట్ చేసుకున్నట్లు ఐసీఐసీఐ ప్రతినిధులు తెలిపారు.

ఐసీఐసీఐ ఫౌండేషన్:

ఐసీఐసీఐ గ్రూప్ ఆశయాలను నెరవేర్చడానికి 2008లో ఐసీఐసీఐ ఫౌండేషన్ స్థాపించబడింది. దేశ సమగ్ర వృద్ది కోసం సామర్ధ్యం కలిగిన నిపుణులను తీర్చిదిద్దుతూ దేశ ఆర్థికావకాశాలలో వారికి భాగస్వామ్యం కల్పిస్తోంది. ప్రైమరీ హెల్త్ కేర్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌ మెంట్, ఆర్థిక వృద్ది నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఐసీఐసీఐ ఫౌండేషన్ ట్రైనీలను తీర్చిదిద్దుతోంది.

సంప్రదించాల్సిన చిరునామా: ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్, మూడో అంతస్తు, జేవీఎల్ టవర్స్, తెలంగాణ అసెంబ్లీ, నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ, పిన్-500004, ఫోన్: 040-48493340

English summary
ICICI Academy for Skills (ICICI Academy) is an institute set up by the ICICI Foundation for Inclusive Growth to provide vocational training to the youth from economically weaker sections to help them earn a sustainable livelihood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X