వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ మృతిపై దత్తాత్రేయ, కేంద్రానికి కేటీఆర్: 'ట్రంప్! ఈ శోకం ఎవరికీ వద్దు'

అమెరికాలో జాత్యాహంకార దాడులు, తెలుగు విద్యార్థి హత్య సహించరానివి అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అన్నారు. జాతి వివక్ష దాడులను అక్కడి ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో జాత్యాహంకార దాడులు, తెలుగు విద్యార్థి హత్య సహించరానివి అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అన్నారు. జాతి వివక్ష దాడులను అక్కడి ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.

టెక్కీ శ్రీనివాస్ భార్య సహా ప్రశ్న: 'ట్రంప్‌కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'టెక్కీ శ్రీనివాస్ భార్య సహా ప్రశ్న: 'ట్రంప్‌కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'

అహంకార దాడుల విషయంలో కేంద్రం అమెరికాతో మాట్లాడుతోందని చెప్పారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడినట్లు తెలిపారు.

శ్రీనివాస్ మృతి నేపథ్యంలో బంధువులు, స్నేహితులు హైదరాబాద్‌లోని శ్రీనివాస్‌ తల్లిదండ్రులను పరామర్శించేందుకు వస్తున్నారు. మంత్రులు కేటీఆర్‌, మహేందర్ రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ తదితరులు శనివారం శ్రీనివాస్‌ తల్లిదండ్రులను ఓదార్చారు.

<strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి</strong>టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి

మరోవైపు, కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి తల్లిదండ్రులు ఆదివారం రాత్రి కేన్సస్‌కు వెళ్లనున్నారు. అమెరికాలో నేరాలను తగ్గించాలని అఖిలపక్షం నేతలు హైదరాబాద్‌లోని అమెరిన్‌ కాన్సులేట్‌ కార్యాలయం ప్రతినిధులకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కూచిభోట్ల శ్రీనివాస్ మృతదేహం రేపు (సోమవారం) హైదరాబాద్ వచ్చే అవకాశముంది.

srinivas kuchibotla

జాతి విద్వేషం కారణంగానే: శ్రీనివాస్ తండ్రి కన్నీరు

జాతి విద్వేషం కారణంగానే తన కొడుకు శ్రీనివాస్‌ కాల్పుల్లో మరణించాడని, ఇప్పుడు ఎవరూ తన అబ్బాయిని తిరిగి తీసుకు రాలేరని, స్నేహితులు సరదాగా మాట్లాడుకుంటుంటే ఉన్మాది ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడని, తల్చుకుంటుంటే తమకు కన్నీరు ఆగడం లేదని శ్రీనివాస్ తండ్రి కంటతడి పెట్టారు.

డొనాల్డ్ ట్రంప్‌... మేము అనుభవిస్తున్న గర్భశోకం మరొకరికి వద్దని, మరో కుమారుడు కాల్పుల్లో చనిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్పరిణామాలు.. ట్రంప్‌కు షాక్: అమెరికాలో తెలుగు వ్యక్తి మృతిపై జేకే రోలింగ్

ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారని, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు కృతజ్ఞతలు అని చెప్పారు. తన కుమారుడు ఇలా తిరిగొస్తాడని అనుకోలేదని శ్రీనివాస్‌ తల్లి వర్ధిని కన్నీరు కార్చారు.

భద్రత కల్పించాలి, కేంద్రం గట్టిగా అడగాలి: కేటీఆర్

అమెరికాలో అందరికీ భద్రత కల్పించాలని కేటీఆర్ అన్నారు. వరంగల్‌ జిల్లా యువకుడు వంశీ రెడ్డిని కాల్చిచంపిన వెంటనే శ్రీనివాస్‌ను కూడా ఇదే తరహాలో కాల్చడం జాత్యహంకార చర్యగా కనిపిస్తోందన్నారు.

ఇది ప్రమాదకరమైన ధోరణి అని వాపోయారు. భారతీయులకు భద్రత కల్పించాలని కేంద్రం ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను గట్టిగా కోరాలన్నారు. తాను కూడా ఆమెరికాలో ఎనిమిదేళ్లు ఉన్నానని, ప్రస్తుతం అక్కడున్న వాతావరణం, పరిస్థితుల దృష్ట్యా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నారు.

English summary
Indian engineer Srinivas Kuchibhotla’s body to reach Hyderabad tomorrow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X