వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు భూతల నరకంగా...: అమెరికానే ఎందుకు దిక్కయింది, ఇప్పుడేమిటి?

భూతల స్వర్గంగా ఉంటూ వచ్చిన అమెరికా ఇప్పుడు తెలుగు విద్యార్థులకు భూతల నరకంగా మారింది. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. అవేమిటి...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగువాళ్లకు ఇప్పటి వరకు అమెరికా అంటే భూతల స్వర్గం. ఇప్పుడు అది భూతల నరకంగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆంక్షలు ఇప్పటికే తెలుగు విద్యార్థులను, టెక్కీలను డైలమాలో పడేస్తే, కాన్సాస్ ఘటన వారిని భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, చదువుతూ డాలర్లు సంపాదించడం అని చెప్తే అమెరికానే గుర్తొచ్చేది. టెక్కీలకైతే అమెరికానే భూతల స్వర్గంగా కనిపిస్తూ వచ్చింది. ప్రస్తుత వాతావరణం ఒక్కసారిగా వారి స్వప్నసౌధాలను కూల్చివేస్తున్నట్లు అనిపిస్తోంది.

అమెరికాకు తమ పిల్లలను పంపే మాట అటుంచి, ఉన్నవారినే వచ్చేయాల్సిందిగా ఇక్కడి తల్లిదండ్రులు కోరుతున్నారు. అమెరికా ఇక ఎంత మాత్రం సేఫ్ కాదనే భయాందోళనలు పట్టిపీడిస్తున్నాయి. పిల్లలు తమ కళ్ల ముందు ఉంటే చాలుననే ఆత్మరక్షణ చట్రంలోకి తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు వచ్చేశారు. అయితే, తెలుగు విద్యార్థులకు అమెరికానే దిక్కు ఎందుకయిందనే ప్రశ్నకు కూడా జవాబు ఉంది. పరిణామాలు వారిని అమెరికాకు నెట్టేస్తూ వచ్చాయి.

అమెరికా కాకుంటే ఏ దేశం...

అమెరికా కాకుంటే ఏ దేశం...

అమెరికాపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో మంచి అవకాశాలు కల్పించే దేశాలేమిటనే అన్వేషణలో తెలుగు విద్యార్థులు పడ్డారు. వారికి ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియాలు కనిపిస్తున్నాయి. అయితే, అవి అమెరికాకు ప్రత్యామ్నాయం అవుతాయా అంటే చెప్పలేని పరిస్థితే ఉంది.

యుకే కూడా ఉండేది...

యుకే కూడా ఉండేది...

ఉన్నత విద్యకు, దాంతో పాటు ఉపాధికి అమెరికాకు సరిజోడుగా యుకె ఉండేది. చదువు పూర్తయిన వెంటనే తగిన ఉద్యోగం చూసుకుని డాలర్లు లేదా పౌండ్లు సంపాదిస్తూ ఆ తర్వాత మెల్లగా గ్రీన్ కార్డు పొంది స్థానికులుగా మారిపోయే వెసులుబాటు ఉండేది. తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) కేవలం చదువు వరకే పరిమితమై ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)లేకుండా చేసింది. దాంతో పూర్తిగా అమెరికాపై ఆధారపడడం ప్రారంభమైంది.

అమెరికాలో అవకాశాలు కూడా ఎక్కువే..

అమెరికాలో అవకాశాలు కూడా ఎక్కువే..

యుకెలో ఉపాధి అవకాశాలకు తెరపడడంతో అమెరికా వైపు చూడడం ప్రారంభమైంది. అమెరికాలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువే. సాంకేతిక రంగాల్లో విశేషావకాశాలు ఉంటూ వచ్చాయి. ఓపీటీ సమయంలో కూడా దాదాపు మూడేళ్ల పాటు ఉండే వెసులుబాటును తెలుగు విద్యార్థులు డాలర్ల సంపాదనకు వాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ అవకాశం పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. ఒక వేళ ట్రంప్ ఆంక్షలు ఏదో మేరకు వెసులుబాటు కల్పించినా జాతివిద్వేష దాడులు వారిని వెనక్కి నెట్టే పరిస్థితి ఉంది.

కెనడా వైపు చూస్తున్నారు...

కెనడా వైపు చూస్తున్నారు...

ఇప్పుడు ఉపాధి, విద్య అనే రెండు కోణాల్లో ఆలోచించి కెనడా, ఆస్ట్రేలియాలను తెలుగు విద్యార్థులు ఎంచుకునే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల్లో విద్యకు అపారమైన అవకాశాలున్నాయి గానీ ఉపాధి లభించడం కష్టంగానే ఉంటుంది. పరిస్థితులు విషమిస్తున్నా ఇప్పటికీ యూఎస్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటి కంపెనీలు ఇతర దేశాల్లోనే కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో అవకాశాలు ఇతర దేశాల్లో కూడా పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.

కెనడాపై చూపు, ఎందుకంటే...

కెనడాపై చూపు, ఎందుకంటే...

అమెరికాలో పరిస్థితులు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు కెనడా వైపు చూస్తున్నారు. దానికి కారణం - అక్కడ త్వరగా స్థానికులుగా మారేందుకు అవకాశం ఉంటుంది. కెనడా స్థానికులుగా మారితే అమెరికాకు వెళ్లడం కూడా సులభమవుతుంది. అమెరికాలో పరిస్థితులు అనుకూలంగా మారితే దాన్ని వాడుకోవచ్చుననేది ఆలోచన. కెనడదాలో శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ, అమెరికాలో గ్రీన్ కార్డులాంటిది) పొందడానికి కేవలం 3 నుంచి 6 ఏళ్లు మాత్రమే పడుతుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లాలంటే కెనడియన్ వీసా ఉంటుంది.

English summary
Since the situation in USA is turning negative, Telugu students are eying on other options like canada and australia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X