వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్‌డేట్: సస్పెన్స్ థ్రిల్లర్‌లా తెలుగువారి కిడ్నాప్, వీడని మిస్టరీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లిబియాలో ఇద్దరు తెలుగు వారిని గురువారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్‌నకు గురైన వారిలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ, కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌ ఉన్నారు. వీరిలో కర్ణాటకు చెందిన లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌ను ఉగ్రవాదులు క్షేమంగా విడిచిపెట్టారు.

అయితే తెలుగు వారిద్దరిని విడిచిపెట్టారా లేదా అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. తెలుగువారిద్దరూ కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారా? సురక్షితంగా బయటపడ్డారా అనే అంశంపై గందరగోశం నెలకొంది. మరోపక్క ‘ఉయ్‌ ఆర్‌ సేఫ్‌(మేం క్షేమంగానే ఉన్నాం)'' అంటూ లక్ష్మీకాంత్‌ మొబైల్‌నుంచి బలరాం భార్య శ్రీదేవికి మెసేజ్‌ వచ్చింది. దీంతో బలరాం, గోపీకృష్ణ కూడా సురక్షితంగా ఉగ్రవాదుల బారినుంచి విడుదలైనట్లు భావిస్తున్నారు.

కర్ణాటకు చెందిన విజయకుమార్‌, లక్ష్మీకాంత్‌ విడుదలైన విషయాన్ని ధ్రువీకరించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, తెలుగువారు విడుదలయ్యారా లేదా అన్నదానిపై స్పష్టతనీయలేదు. బలరాం కుటుంబం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో, గోపీకృష్ణ కుటుంబం నాచారంలో నివసిస్తోంది.

దీంతో అందోళనతో ఉన్న కుటుంబాలు తమ వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వారిద్దరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

అపహరణకు గురైన నలుగురూ లిబియాలోని సిర్టే వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు ట్రిపోలీ, టునిస్‌ మీదుగా భారత్‌కు వీరు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో కారులో వస్తుండగా సిర్టే పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్‌పోస్ట్‌ వద్ద వీరిని ఉగ్రవాదులు అపహరించారు.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

భారతీయుల కిడ్నాప్ అంశంపై ట్రిపోలీలోని భారత మిషన్‌ అధిపతిని సంప్రదించామని విదేశాంగ శాఖ వర్గాలు చెప్పాయి. లక్ష్మీకాంత్‌, విజయకుమార్‌ను ఉగ్రవాదులు విడిచిపెట్టారని పేర్కొన్నాయి.

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

కిడ్నాపర్ల చెర నుంచి మిగిలిన ఇద్దరినీ క్షేమంగా విడుదల చేయించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ వెల్లడించారు.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ ఓయూలో పీహెచ్‌డీ చేసి ఏడేళ్ల క్రితం లిబియాకు వెళ్లి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గోపీకృష్ణ భార్య కళ్యాణి, కుమారుడు కృష్ణసాయి ఈశ్వర్‌(4), కుమార్తె జాహ్నవి(10)లతో కలిసి నాచారంలోని వీరారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

కిడ్నాప్‌నకు గురైన తనభర్తను క్షేమంగా విడిపించాలని గోపీకృష్ణ భార్య కల్యాణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, కరీంనగర్‌ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన సి.హెచ్‌.బలరాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లంలో పీహెచ్‌డీ చేశారు.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

లిబియాలో సిర్తే వర్సిటీలో పనిచేయడానికి వెళ్లారు. ఆయన భార్య పిల్లలు శ్రీదేవి, విజయ్‌భాస్కర్‌, మధుసూధన్‌ అల్వాల్‌లోని సుభాష్‌నగర్‌లో నివాసముంటున్నారు. బలరాం క్షేమంగా ఉన్నట్లు మెసేజ్‌ రావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

లిబియాలో అపరహణకు గురైన భారతీయులను క్షేమంగా విడిపించుతున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లు విడిపించామని, మిగతా ఇద్దర్నీ విడిపిస్తామని చెప్పారు.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

ఇంకా విడుదల కాలేదని పేర్కొన్న ఆ ఇద్దరు తెలుగువారు. ఆ తర్వాత వారిని కూడా కిడ్నాపర్లు విడుదల చేశారు. అందుకే భార్యకు బలరాం సందేశం పెట్టారని తెలుస్తోంది. అంతకుముందు.... లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురైన విషయం తెలియగానే కేంద్రం వెంటనే స్పందించింది.

 సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

సస్పెన్స్ థ్రిల్లర్‌లా లిబియాలో తెలుగువారి కిడ్నాప్

వారిని క్షేమంగా విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వారిని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కిడ్నాప్‌కు గురైన నలుగురు భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.

English summary
Confusion and tension prevailed in the homes of Gopi Krishna and Balram Kishan — two of the four Indians abducted by ISIS in Libya — in Hyderabad on Friday. The uncertainty over their fate precipitated into panic by night following an official announcement that two of the abducted professors had been released in Libya after negotiations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X