వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న గాక మొన్నొచ్చి!?: జూనియర్ వర్సెస్ సీనియర్, రేవంత్‌పై మోత్కుపల్లి అసహనం

దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ వస్తున్న తనలాంటి సీనియర్.. ఒక జూనియర్ ముందు తేలిపోవడంపై లోలోపలే మదనపడుతున్నారట.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా!..', ఇదీ ఓ ఫేమస్ తెలుగు సినిమాలో డైలాగ్. ఇదే డైలాగ్ ను ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం రాజకీయాలకు అన్వయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే.. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో పాతుకుపోయిన ఘనాపాటిలను కాదని, నిన్న గాక మొన్నొచ్చిన 'రేవంత్' ఆ పార్టీ రాజకీయాలను శాసించడమేంటి?

'సొంతకుంపటి ఆలోచనలో రేవంత్ ?' : టీడీపీని ఓ పావులా వాడుకుంటున్నారా?'సొంతకుంపటి ఆలోచనలో రేవంత్ ?' : టీడీపీని ఓ పావులా వాడుకుంటున్నారా?

రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, తెలంగాణలో తానే పార్టీకి అధినాయకత్వం అన్న తరహాలో వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. 1983లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోత్కుపల్లి.. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు పార్టీనే తన గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్న రేవంత్ తీరును జీర్ణించుకోలేకపోతున్నారు.

రేవంత్ సొంత ఎజెండా:

రేవంత్ సొంత ఎజెండా:

పేరుకు టీడీపీ నేతనే గానీ రేవంత్ ఎజెండా అంతా సొంత ఎజెండానే అనేది మోత్కుపల్లి సహా ఆ పార్టీ సీనియర్ నేతల అంతర్గత ఆరోపణ. తమను పట్టించుకోడు.. తమతో సమాలోచనలు జరపడు.. తనకు నచ్చినట్లు వ్యవహరిస్తూ తానే అధినాయకత్వం అన్న పరోక్ష సంకేతాలను పంపిస్తుంటాడు. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌ను మట్టికరిపించేందుకు టీడీపీ వ్యతిరేక శక్తులతో జతకట్టడానికైనా సిద్దమేనంటూ ఇటీవల రేవంత్ ఒక ప్రకటన చేశాడు.

 ఎవరిని అడిగి ఆ నిర్ణయం!:

ఎవరిని అడిగి ఆ నిర్ణయం!:

దాని సారాంశం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలో నిలవడమే. ఇదే విషయం మోత్కుపల్లికి నిద్ర పట్టనివ్వడం లేదట. ఎవరినీ సంప్రదించకుండా.. ఎవరితోను చర్చలు జరపకుండా.. తనకు నచ్చినట్లు రేవంత్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడమంటే.. అంతకుమించిన రాజకీయ దిగజారుడుతనం లేదనేది మోత్కుపల్లి వాదన. దీనికి తోడు హైదరాబాద్ లో నిర్వహించిన మహానాడులోను రేవంత్ కు దక్కుతున్న ప్రాధాన్యతను, తనకు దక్కుతున్న ప్రాధాన్యతను పోల్చుకుని ఆయన ఆవేదన చెందారట.

చంద్రబాబు పట్టించుకోరు!:

చంద్రబాబు పట్టించుకోరు!:

దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ వస్తున్న తనలాంటి సీనియర్.. ఒక జూనియర్ ముందు తేలిపోవడంపై లోలోపలే మదనపడుతున్నారట. రేవంత్ వ్యవహారంపై చంద్రబాబు వద్ద ప్రస్తావించినా.. పెద్ద లాభం లేకపోవడంతో.. ఆయన ఆవేదన వినేవారే కరువైన పరిస్థితి. జూనియర్ చేస్తున్న రాజకీయాలను ఒక సీనియర్‌ నేత అయి ఉండి కూడా నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిన పరిస్థితిపై మోత్కుపల్లి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయేలా ఉందనడంలో అతిశయోక్తి లేదేమో!

English summary
Telangana TDP leader Motkupalli Narasimhulu expressed anguish for not giving importance to him in party affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X