అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్యూ: ఫైటింగ్ ఆపండి..!, ఏపీ, తెలంగాణ భారత్‌లోనే ఉన్నాయి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ఏపీ, తెలంగాణ సీఎంలు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వన్ఇండియాకు ఆయన ఇంటర్యూ ఇచ్చారు.

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు రాష్ట్రాలకు మంచివి కావని, చాలా బాధాకరమని చెప్పారు.

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వివాదం ఎందుకు తారా స్ధాయికి చేరింది?
ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోలేరు. ఇది వ్యక్తిగత శత్రుత్వం కాదని, ప్రజల మధ్యలో రాజకీయ శత్రుత్వంగా మారింది. అందుకే ఈ వివాదం తారాస్ధాయికి చేరింది.

Interview: Stop fighting! Telangana, Andhra Pradesh are both in India

రాజకీయ శత్రుత్వం అని ఎందుకు నొక్కి మరీ చెబుతున్నారు?
ఇద్దరు సీఎంలు కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఎన్నికల సమయంలో ఇద్దరూ తప్పుడు హామీలను ఇచ్చారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజల కొంత భావోద్వేగాలు నెలకొన్నాయి. ఆ భావోద్వేగాలను మరింతగా రెచ్చగొట్టి రాజకీయంగా లభ్ది పొందాలని చూస్తున్నారు.

కేసీఆర్, చంద్రబాబుల మధ్య శత్రుత్వం లేదని ఎలా చెబుతున్నారు?
నేను ఖచ్చితంగా చెప్పగలను వారిద్దరి మధ్య ఎలాంటి శుత్రుత్వం లేదు. తెలంగాణలోని బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించేటప్పుడు కేసీఆర్ చాలా సార్లు చంద్రబాబు గారు అని సంబోధిస్తారు. ఏపీ సీఎం కూడా కేసీఆర్‌ను పేరు పెట్టే పిలుస్తారు. ప్రజల సమక్షంలో ఇద్దరూ తిట్టుకుంటారు.

ప్రైవేట్‌గా ఒకరికొకరు హత్తుకుంటారు. పబ్లిక్‌గా ప్రజలను పూల్స్ చేస్తూ, గేమ్ ఆడుతున్నారు. ఏపీ, తెలంగాణలోని చాలా సమస్యలను గవర్నర్ సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోవచ్చు. నీరు, ఉద్యోగాలు, కరెంట్ లాంటి సమస్యలను కేవలం ఒకే ఒక్క సిట్టింగ్‌లో పరిష్కరించుకోవచ్చు. కానీ అలా చేయరు.

వచ్చే ఎన్నికల్లో వీళ్లు మళ్లీ గెలుస్తారా?
రారు, అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. 2014 ఎన్నికల్లో ప్రజలు భావోద్వేగంతో ఓట్లు వేశారు. ఆ సమయంలో ఓటరు‌కి సమస్యలు కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కొత్త రాష్ట్రం కోసమే టీఆర్ఎస్‌ను గెలిపించారు. ఏపీ విభజన కారణంగా కాంగ్రెస్‌ను ఓడించాలనే కసితో ఏపీలో టీడీపీని గెలిపించారు.

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌పై మీ స్పందన?
ఓటుకు నోటు కేసులో బాబుపై వచ్చిన ఆరోపణలు రాజ్యాంగం ప్రకారం నిలబడవని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుసు. ఇదంకా ఒక గేమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, చట్ట ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేయాలి. నాయుడుకు ముందే తెలుసు ఇదంతా గేమ్‌లో భాగమేనని, ఇలాంటి వ్యూహాలు ఉండటం ఎంతైనా అవసరమని ఇద్దరికీ తెలుసు.

కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుంటుందా?
ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాత్రం కేంద్రం కలగజేసుకుంటుందని భావిస్తున్నా? ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తప్పకుండా తీసుకెళ్లాలి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎందుకింత ఆలస్యం?
ఈ విషయం కేసీఆర్‌ని అడగాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవడని కేసీఆర్‌కు తెలుసు. అన్ని సర్వేలు కూడా టీఆర్ఎస్ ఓటమినే చెబుతున్నాయి. అందుకే గ్రేటర్ ఎన్నికలను కావాలనే వాయిదా వేస్తున్నాడేమో.

ఏపీ-తెలంగాణ వివాదంపై మీరిచ్చే సలహా?
పరిష్కారం సులభం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భారత్‌లోనే ఉన్నారనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.

English summary
Telangana and Andhra Pradesh are engaged in a bitter battle thanks to their respective Chief Ministers. For starters one must realize that Telangana and Andhra Pradesh are part of the same country and although the bifurcation of the erstwhile Andhra Pradesh has had mixed reactions, the time has come to move on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X