వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమర్ అలియాస్ సుబ్రహ్మణ్యం: ఫేస్ బుక్ లో పరిచయం.. ఐసిస్ వైపు పయనం

నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని సిట్‌ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

చదవండి: సిరియాపై ఉగ్ర స్థావరాలపై రష్యా అటాక్... క్షిపణి దాడి ఇలా... (వీడియో)

కృష్ణా జిల్లాకు చెందిన ఇతడి అసలు పేరు సుబ్రహ్మణ్యం అని, కొన్నాళ్ల క్రితం మతం మార్చుకుని ఒమర్‌గా మారాడని నగర అదనపు కమిషనర్‌ (నేరాలు, సిట్‌) స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు.

మతం మార్చుకుని.. ఒమర్ గా..

మతం మార్చుకుని.. ఒమర్ గా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన కొనకళ్ల సుబ్రహ్మణ్యం స్వస్థలంలోనే విద్యనభ్యసించాడు. ఇంటర్మీడియట్‌ చదువుతుండగా తన ముస్లిం స్నేహితుల్ని చూసి స్ఫూర్తి పొందాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో.. 2014లో మతం మారి, తన పేరును ఒమర్‌గా మార్చుకున్నాడు.

మదర్సాలలో చేరి.. ఉర్దూ నేర్చుకుని..

మదర్సాలలో చేరి.. ఉర్దూ నేర్చుకుని..

తన తండ్రి వెంకట నర్సింహారావుకు కూడా తెలియకుండా గుజరాత్‌ నుంచి వచ్చిన మత ప్రచారకులతో కలసి ఆ రాష్ట్రం వెళ్లిపోయాడు. దాదాపు 40 రోజుల పాటు వారితో గడిపిన ఒమర్‌... ఆపై అక్కడి సిద్ధాపూర్‌లోని ఓ మదర్సాలో చేరాడు. 9 నెలల పాటు ఉర్దూ సహా ఇతర అంశాలు నేర్చుకున్నాడు. కుమారుడి కోసం గాలించిన తండ్రి వెంకట నర్సింహారావు ఎట్టకేలకు అతడ్ని గుర్తించి చల్లపల్లి తీసుకువెళ్లాడు. కొంతకాలం బాగానే ఉన్న సుబ్రహ్మణ్యం ఓ రోజు తండ్రి మందలించడంతో మళ్లీ ఇల్లు వదిలాడు. ఈసారి తమిళనాడులోని కోయంబత్తూరు వెళ్లాడు. అక్కడి ఒమ్రా ప్రాంతంలో ఉన్న మరో మదర్సాలో చేరాడు. మరోసారి కుమారుడి ఆచూకీ గుర్తించిన తండ్రి అక్కడకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు.

ఐసిస్‌ వైపు ఆకర్షితుడై...

ఐసిస్‌ వైపు ఆకర్షితుడై...

తండ్రితో కలిసి ఉండటం ఒమర్‌ కు నచ్చక... రెండేళ్ల కిందట నగరంలోని బాలానగర్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. అక్కడే ఉంటూ సోడా బండి వ్యాపారం చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్‌-హింద్‌తో ఇతడికి పరిచయమైంది. అతడితో ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌ ద్వారా తరచూ చాటింగ్‌ చేయడం ప్రారంభించాడు. అల్‌ హింద్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే ఐసిస్‌ వైపు ఆకర్షితుడైన ఒమర్‌ ఆ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరుడిగా మారాడు. అతడి ఆహ్వానం మేరకు ముంబై వెళ్లిన ఇతగాడు మూడు రోజులు అక్కడే ఉండి వచ్చాడు. అల్‌హింద్‌ సూచనల మేరకు గుజరాత్, శ్రీనగర్, ఓమ్రాబాద్, అంబూర్‌ల్లో సైతం సంచరించాడు.

ఐసిస్‌ వైపు లాగేందుకు యత్నం...

ఐసిస్‌ వైపు లాగేందుకు యత్నం...

ఒమర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా టోలీచౌకీలో నివస్తున్న వరంగల్‌కు చెందిన అమీర్‌తో పరిచయమైంది. వికలాంగుడైన ఇతడికి సహాయంగా ఉంటానంటూ అతడి ఇంట్లోకే మకాం మార్చాడు. అక్కడ ఉంటూనే ఫేస్‌బుక్‌ ద్వారా మరికొందరిని ఐసిస్‌ వైపు ఆకర్షితుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సిట్‌ అధికారులు శుక్రవారం ఒమర్‌ను అరెస్టు చేశారు. ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్‌-హింద్‌ పైనా కేసు నమోదు చేసిన అధికారులు అతడి కూడా గాలిస్తున్నారు.

English summary
An ISIS sympathiser, who allegedly wanted to carry out subversive activities in the country, was today arrested here by the city police. According to the police, Konakalla Subramanyam alias Omer (22) was in touch with other ISIS sympathisers through social media. His interrogation revealed he had embraced Islam in 2014. Later, he visited Gujarat and trained in religious rituals and scriptures. He also visited Srinagar and other places in Tamil Nadu and Mumbai, the police said.He allegedly chatted with ISIS sympathisers through Facebook, WhatsApp, Telegram and was in regular touch with Abu Qahafa Al-Hindi, a Mumbai-based ISIS sympathiser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X