వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ సంస్థ! రూ.కోటిన్నర పోగొట్టుకున్న 120 మంది నిరుద్యోగులు

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో ‘సెరినక్స్‌’ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. సుమారు 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో 'సెరినక్స్‌' అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. సుమారు 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది.

బాధితులు ఈ మేరకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, సదరు సంస్థకు ఎండీలుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 కంప్యూటర్లు, 12 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. వీరు సెరినక్స్ పేరిట సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించి, అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేవారని చెప్పారు.

మంచి ప్యాకేజితో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కో వ్యక్తి నుంచి లక్ష లేదా లక్షన్నర రూపాయల వరకు వసూలు చేశారని, ఎన్ని నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, జీతాలు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

English summary
Five directors of an IT firm in Madhapur, Hyderabad, who allegedly duped over 120 unemployed of Rs.1.5 crore by not giving jobs since long time and refusing to refund their security deposits, was arrested by the Madhapur police on Wednesday. According to the DCP of Madhapur.. the directors established an IT company in the name of Serinux at Madhapur and giving training to the unemployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X