హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి మేకిన్ తెలంగాణ ట్యాబ్లెట్ పీసీ విడుదల: అభినందించిన కెటిఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెల్‌కాన్ కంపెనీ తయారు చేసిన తొలి మేకిన్ తెలంగాణ ట్యాబ్లెట్ పీసీని ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం విడుదల చేశారు. తక్కువ సమయంలోనే సెల్‌కాన్ కంపెనీ 10 లక్షల ఫోన్లు తయారు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అన్నారు.

మొబైల్ రీసెర్చ్ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. తెలంగాణలో మొబైల్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. త్వరలో హైదరాబాద్‌లో రియల్ వ్యాపారం పెరగనుందని చెప్పారు..

IT Minister KTR launches Celkon Tablet

చండీయాగానికి రండి: గవర్నర్‌కు కెసిఆర్ ఆహ్వానం

టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. హైదరాబాదులోని రాజ్ భవన్‌కు వెళ్లిన కెసిఆర్ గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

డిసెంబర్ 23 నుంచి కెసిఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫాంహౌస్)లో కేసీఆర్ ఈ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు.

IT Minister KTR launches Celkon Tablet

తాను నిర్వహిస్తున్న చండీయాగానికి హాజరుకావాలని ఈ సందర్భంగా కేసీఆర్ గవర్నర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానానికి గవర్నర్ నుంచి కూడా సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. కెసిఆర్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా డిసెంబర్ 27న చండీయాగానికి వస్తున్నట్లు సమాచారం.

English summary
IT Minister KT Rama Rao on Tuesday launched Celkon Tablet, which is Made In Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X