విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై గుర్రు: గవర్నర్‌కు ఐవైఆర్ ఫిర్యాదు?, మీడియాతో మాట్లాడకుండా..

తనను ఏపీ బ్రాహ్మణ సంఘం చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై ఐవైఆర్ కృష్ణా రావు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గుర్రుగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తనను ఏపీ బ్రాహ్మణ సంఘం చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై ఐవైఆర్ కృష్ణా రావు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గుర్రుగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

ఐవైఆర్ పొలిటికల్ వ్యూహం: టిక్కెట్‌కు చంద్రబాబు నో, జగన్ హామీ?ఐవైఆర్ పొలిటికల్ వ్యూహం: టిక్కెట్‌కు చంద్రబాబు నో, జగన్ హామీ?

తనను బ్రాహ్మణ సంఘం చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై ఆయన గవర్నర్‌తో చర్చించారని తెలుస్తోంది. అలాగే, చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు కూడా చేశారని తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ అనంతరం ఐవైఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లారు.

IYR Krishna Rao meets Governor Narasimhan

ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన స్థానంలో వేమూరి ఆనందసూర్యను నియమించింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి సాంబశివరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు ఉంచారనే కారణంతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించింది.

తొలుత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వుల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. గతంలో ఇచ్చిన జీవోల తేదీలు తప్పుగా చూపించారు. ఆ తర్వాత వాటిని సవరిస్తూ మరో ఉత్తర్వును విడుదల చేశారు. టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు... 2016 జనవరి 29న కృష్ణారావును ఛైర్మన్‌గా నియమించింది.

ఐవైఆర్ తర్వాత వేమూరి ఆనంద్ సూర్య.. బాబుకు 'తెలంగాణ' చిక్కుఐవైఆర్ తర్వాత వేమూరి ఆనంద్ సూర్య.. బాబుకు 'తెలంగాణ' చిక్కు

ఈ పదవి కాలపరిమితి అప్పట్లో మూడేళ్లని పేర్కొన్నారు. దీంతో పాటు అర్చక సంక్షేమనిధికి ఆయనను ఛైర్మన్‌గా నియమించింది. కృష్ణారావును పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో... తొలి నుంచి టిడిపిలో ఉన్న వేమూరి ఆనంద సూర్యను బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అర్చక సంక్షేమ నిధి ఛైర్మన్‌ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నదీ అందులో పేర్కొనలేదు. ఆనందసూర్య రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

English summary
IYR Krishna Rao meets Governor Narasimhan and it is said that he talk about Andhra Pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X