మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడవిలో తప్పిపోయిన తెలంగాణ మంత్రి! అసలేం జరిగింది?

జిల్లాలోని నర్సాపూర్‌లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీశాఖ మంత్రి జోగు రామన్న తదితరులు అడవిలో దారితప్పారు. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్-హైదరాబాద్ రహదారిలో పందివాగు నుంచి మొక్కలు నాటే స్థలం వరకు

|
Google Oneindia TeluguNews

మెదక్: జిల్లాలోని నర్సాపూర్‌లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీశాఖ మంత్రి జోగు రామన్న తదితరులు అడవిలో దారితప్పారు. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్-హైదరాబాద్ రహదారిలో పందివాగు నుంచి మొక్కలు నాటే స్థలం వరకు 3కిలోమీటర్ల దూరం ఉంటుంది.

కాలినడకనే..

కాలినడకనే..

ఆ అటవీ ప్రాంతానికి మంత్రి జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రాజమణీ మురళీధర్ యాదవ్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్ భారతీ హోలికేరి కాలినడకన చేరుకున్నారు.

Recommended Video

BJD MLA Carried by His Supporters to Cross Ankle-Deep Water : Caught on cam:
దారితప్పారిలా..

దారితప్పారిలా..

మొక్కలు నాటాక.. నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పరుపు బండ వద్ద భోజనాల కోసం కాలినడకనే బయలుదేరారు. మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఇతరులు కలిసి ముచ్చటించుకుంటూ వెళ్తూ దారి తప్పి మరో 3కిలోమీటర్ల దూరం వెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని తిరిగి భోజనాల స్థలం వద్దకు తీసుకొచ్చారు.

సాహస యాత్రే..

సాహస యాత్రే..

న‌ర్సాపూర్ అట‌వీ ప్రాంతంలో 6 కిలో మీట‌ర్లు కాలి న‌డ‌క‌న వాగులు, వంక‌లు దాటుతూ.. డీ గెడ్రెడ్ ఫారెస్ట్‌లో మొక్క‌లు నాటారు. సీడ్ బాంబింగ్ చేశారు. న‌క్స‌ల్స్ ఖిల్లా అయిన న‌ర్సాపూర్ అడ‌వుల్లో మంత్రి జోగు రామ‌న్న సాహ‌స యాత్ర చేశారు. భారీ పోలీసు బ‌ల‌గాల మ‌ధ్య మంత్రి జోగు రామ‌న్న అడ‌వుల్లో ప్ర‌యాణం సాగింది. ఇన్‌సైడ్ ఫారెస్ట్‌లో 20 కోట్ల మొక్క‌లు నాటే ప్ర‌ణాళిక‌ను మంత్రి జోగు రామ‌న్న బుధ‌వారం శ్రీ‌కారం చుట్టారు.

14రోజుల్లో 12కోట్ల మొక్కలు..

14రోజుల్లో 12కోట్ల మొక్కలు..

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన నాటి నుంచి అలుపెర‌గ‌కుండా మంత్రి జోగు రామ‌న్న జిల్లాల‌ను క‌లియ తిరుగుతున్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14 రోజుల్లో దాదాపు 12 కోట్ల మొక్కల‌ను నాటామ‌ని ఆయ‌న తెలిపారు.

English summary
In a shocking incident, Forest Minister Jogu Ramanna was missing for about half an hour in the Narsapur forest area but luckily reached the spot where he started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X