వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు వైద్యుడితో కలిసి పేదలకు 'కలాం-రాజు' స్టెంట్, ఆత్మకథలో హైద్రాబాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైద్య రంగ చరిత్రలో అతి తక్కువ ధరకే స్టెంట్ అందజేసిన ఘనత అబ్దుల్ కలాంకు దక్కుతుంది నిమ్స్‌లో నాటి హృద్రోగ నిపుణులు డాక్టర్ సోమరాజుతో కలిసి డీఆర్డీవోలో దీనిపై పరిశోధనలు చేసారు. హృద్రోగులకు అమర్చే స్టెంట్ ధనవంతులకే అందుబాటులో ఉండేది.

సోమరాజుతో కలిసి కలాం కొత్త రకం స్టెంట్‌కు రూపమించ్చారు. పేదలకు రూ.10వేలకే అందించి, ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపారు. ఇది కలాం-రాజు స్టెంట్‌గా ప్రాచుర్యం పొందింది. దీని కారణంగా వివిధ కంపెనీలు తమ స్టెంట్ రేట్లను తగ్గించుకోవాల్సి వచ్చింది.

1994 వరకు స్టెంట్‌లు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వారు. దాంతో వాటి ధర ఒక్కోటి రూ.రెండు నుండి మూడు లక్షల వరకు ఉండేది. కేర్ ఫౌండేషన్ సోమరాజుకు కలాంతో దాదాపు మూడు దశాబ్దాల స్నేహం ఉంది. తాను మూడు వారాల క్రితమే కలాంతో మాట్లాడనని డాక్టర్ సోమరాజు సోమవారం చెప్పారు.

అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాంకు హైదరాబాదుతో విడదీయరాని బంధం ఉంది. ఈ మాటను ఆయన తన ఆత్మకథలోను రాసుకున్నారు. శాస్త్రవేత్తగా హైదరాబాదులో కీలక పరిశోధనలు చేశారు. పలు స్కూళ్లు, పాఠశాలల్లో ప్రసంగాలు ఇచ్చారు. సెంట్రల్ వర్సీటీతోను అనుబంధం ఉంది.

 అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

హైదరాబాద్ ఎంతో అందమైన నగరమని, నగరంలో రాక్ గార్డెన్స్ అద్భుతంగా ఉంటాయని, నగర శివార్లలో కనిపించే గుట్టలు, కొండలు చూస్తుంటే కదలాలని అనిపించదని, ఒకదానిపై ఒకటి ఎవరో పేర్చినట్లు ఉండే రాళ్లు అందంగా కనిపిస్తాయని, హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని కలాం పేర్కొన్నారు.

 అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

ప్రాణాంతక పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నగరంలో స్కోప్ అనే స్వచ్చంధ సంస్థ చేపట్టిన ప్రచారోద్యమానికి అబ్దుల్ కలాం స్ఫూర్తిగా నిలిచారు. వంద కోట్ల సంతకాల సేకరణలో తొలి సంతకం కలాం చేశారు. లీడ్ ఇండియా సంస్థతో కలిపి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

భారతీయ విద్యా భవన్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ మహీంద్రా కార్యక్రమంలో పాల్గొనేందుకు అబ్దుల్ కలాం 14 మే 2015న వచ్చారు. ఇదే హైదరాబాద్‌లో ఆయన చివరి కార్యక్రమం.

 అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

ఉస్మానియా విశ్వవిద్యాయంతోను ఆయనకు మంచి అనుబంధం ఉంది. క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆర్ అండ్ బి యూనిట్ ఫర్ నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ స్థాపించి తొలి డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సంస్థ ద్వారా పలు పరిశోధనలు చేసి రక్షణ రంగానికి అందించారు. ఓయును పలుమార్లు సందర్శించారు.

 అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమ కీలక దశలో ఉంది. ప్రస్తుత ఎంపీ, నాటి ఓయు విద్యార్థి బాల్క సుమన్ జై తెలంగాణ నినాదాలు చేయగా, ఓపిక పట్టాలని కలాం సూచించారు. శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

అబ్దుల్ కలాం

అబ్దుల్ కలాం

డిఆర్డీఎల్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో హైదరాబాద్ శివార్లలోని మల్లాపూర్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్‌ ఇమారత్‌కున(ఆర్సీఐ) సృష్టికర్త అబ్దుల్ కలాం. కలాం ప్రతిభను గుర్తించి కేంద్రం ఆర్సీఐ ప్రారంభ డైరెక్టర్‌గా నియమించింది.

English summary
Dr.Soma Raju said that we worked very closely on the Kalam-Raju stent where cost effectiveness was the main goal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X