హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చి 16న, ఇండియన్ అమెరికన్ అప్రిషియేషన్ డే , టెక్కీ శ్రీనివాస్ కు నివాళి

మార్చి 16వ, తేదిని ఇండియన్ అమెరికన్ అప్రిషియేషన్ రోజుగా జరుపుకోవాలని క్యానాస్ గవర్నర్ నిర్ణయం తీసుకొన్నారు. ఇండియన్లకు సాదరంగా స్వాగతం పలుకుతామని ఆయన ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: మార్చి 16వ, తేదిని ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ రోజుగా జరుపుకోవాలని కాన్సాస్ గుర్తించింది. జాత్యంహకార దాడులు పునరావృతం కానివ్వబోమని క్యానాస్ గవర్నర్ బ్రౌన్ బ్యాక్ ప్రకటించారు. ఇండియన్లకు తాము సాదరంగా స్వాగతం పలుకుతామని ఆయన పునరుద్ఘాటించారు.

ఇటీవల అమెరికాలో జాత్యంహకార దాడిలో హైద్రాబాద్ కు చెందిన టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. ఈ ఘటనపై అమెరికాలో సాగుతున్న దాడుల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

అయితే అమెరికాలో నావిక దళంలో పనిచేసిన మాజీ సైనికోద్యోగి ఆడమ్ ప్యూరిటన్ ఓ బార్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 22న, శ్రీనివాస్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ ఆసుపత్రిలో చనిపోయాడు.ఆలోక్ రెడ్డి ఈ ఘటనలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. ప్యూరిటన్ దాడి నుండి తప్పించేందుకుగాను మరో అమెరికన్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Kansas recognises March 16 as Indian-American Appreciation Day

అయితే హింసను క్యానాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు.అయితే క్యానాస్ మంచి ప్రదేశంగా మారడంలో ఇండియన్ల పాత్రను మరువలేనిదని ఆయన కొనియాడారు.ఇందుకుగాను ఆయన ఇండియన్లకు ధన్యవాదాలు తెలిపారు.

అయితే భారతీయులకు తాము ఘనంగా స్వాగతం పలుకుతామని ఆయన చెప్పారు. తమ విలువలను కొనసాగిస్తామని ఆయన టోపెకాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.

ప్యూరిటన్ దాడిలో గాయపడిన గ్రిల్లియాంట్ అనే అమెరికన్ మాదసానిలు కూడ ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ ఈ సభకు హజరైన జనం సాక్షిగా బ్రౌన్ బ్యాక్ మాదసానిని క్షమాపణలు కోరారు.

ప్యూరిటన్ దాడి నుండి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన అమెరికన్ ఇయాన్ గ్రిల్లియాంట్ ను బ్రౌన్ బ్యాక్ అభినందనలతో ముంచెత్తారు. అలోక్ రెడ్డి, గ్రల్లియాంట్ లు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకొన్నారు. ప్రతి ఏటా మార్చి 16వ, తేదిన ఇండియన్, అమెరికన్ అప్రిషియేషన్ దినోత్సవంగా గుర్తిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

క్యానాస్ లో ఉండే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తామని బ్రౌన్ బ్యాక్ మరోసారి హమీ ఇచ్చారు. ఈ సభలో పాల్గొన్న మాదసాని మాట్లాడుతూ కూచిబొట్ల శ్రీనివాస్ తమకు అందరికీ ఆదర్శప్రాయుడన్నారు.అంతేకాదు ఆయన అంటే తమకు గర్వకారణమన్నారు. శ్రీనివాస్ మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

English summary
The US state of Kansas has recognised March 16 as 'Indian-American Appreciation Day' to honour an Indian techie who was killed last month in a racially-motivated hate crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X