హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేక్ తిని క్రిస్టియన్లకు కేసీఆర్ వరాలు, వాటికి మాత్రం నో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో క్రైస్తవులు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రూ.10 కోట్ల వ్యయంతో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. అనువైన స్థలం కోసం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. లలిత కళాతోరణంలో నిర్వహించిన 36వ ఐక్య క్రిస్మస్ ఉత్సవాల్లో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి లోటు ఉండదన్నారు. మతం మార్చుకున్నంతనే కులం మారినట్లుగా కాదని, దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ వారి హక్కులకు భంగం కలుగదని, మా ప్రభుత్వం దళితులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నదో అవే పథకాలు దళిత క్రైస్తవులకూ అందుతాయని, వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు.

క్రైస్తవ సోదరుల కోరిక మేరకు జనవరి 1న ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తామని, క్రిస్మస్‌ పండుగకు రెండురోజుల ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. వచ్చే క్రిస్మస్‌ వేడుకలను ఆ భవనంలోనే మనం జరుపుకుందామన్నారు. ప్రత్యేక సమాధుల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను కేటాయిస్తామని, దానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తామన్నారు.

శాంతికపోతం ఎగరేస్తున్న కేసీఆర్

శాంతికపోతం ఎగరేస్తున్న కేసీఆర్

క్రైస్తవ సోదరుల కోరిక మేరకు జనవరి 1న ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తామని, క్రిస్మస్‌ పండుగకు రెండురోజుల ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.

కేసీఆర్

కేసీఆర్

గురువారం నాంపల్లి లలిత కళా తోరణంలో నిర్వహించిన 36వ ‘యునైటెడ్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌'లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేక్ కట్ చేసి తినిపిస్తున్న పలువురు దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేక్ కట్ చేసి తినిపిస్తున్న పలువురు దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేక్ తినిపిస్తున్న మంత్రి డాక్టర్ టీ రాజయ్య.

కేసీఆర్

కేసీఆర్

ఈ సందర్భంగా దళిత క్రైస్తవులపై వరాల వర్షం కురిపించారు. రూ.10 కోట్లతో క్రిస్టియన్‌ భవన్‌ను హైదరాబాద్‌లో అద్భుతరీతిలో నిర్మిస్తామని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

దాని కోసం శుక్రవారమే జీవో జారీ చేస్తామన్నారు. వచ్చే క్రిస్మస్‌ వేడుకలను ఆ భవనంలోనే మనం జరుపుకుందామని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

ప్రత్యేక సమాధుల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను కేటాయిస్తామని, దానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తామని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

చర్చిల నిర్మాణ ప్రక్రియను సులభతరం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అనుమతిపైనా శుక్రవారం జీవోని తీసుకొస్తామని తెలిపారు.

చర్చిల నిర్మాణ ప్రక్రియను సులభతరం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అనుమతిపైనా శుక్రవారం జీవోని తీసుకొస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగిన క్రైస్తవ ఫాదర్లపై దాడుల ఘటనలను ఖండిస్తున్నట్టు, వారి భద్రత, జీవన రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకొంటామని చెప్పారు.

నేను గత 16,17 సంవత్సరాలుగా హైదరాబాద్‌ చాపెల్‌ రోడ్డులోని చర్చికి ఏటా వెళ్తున్నానని, అక్కడే ప్రతి యేటా క్రిస్మస్‌ సందర్బంగా ఆశీర్వాదం తీసుకుంటానని, ఈసారీ అక్కడే వేడుకల్లో పాల్గొంటానని చెప్పారు. క్రైస్తవులకు ప్రత్యేక బోర్డు ఉండాలన్నారు. దాని ద్వారానే జెరుసలేం యాత్రకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. కేసీఆర్ సెలవు దినాల గురించి మాట్లాడుతుండగా.. జనవరి 1న కూడా సెలవు ప్రకటించాలని గట్టిగా నినదించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమంలో నేను పెట్టిన కేక కంటే బాగుందని చమత్కరించారు. జనవరి 1న సెలవుదినం ప్రకటిస్తామన్నారు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలకు విద్యా గ్రాంట్ల కేటాయింపు, పాఠశాలలకు ఆస్తి పన్ను రద్దు వంటి అంశాలపై తాను ఎడాపెడా హామీలు ఇవ్వలేనని చెప్పారు. ఒకరికి ఇస్తే మిగిలిన వారు కూడా ఇలాగే అడిగేందుకు ఆస్కారముందన్నారు.

English summary
Telangana Chief Minister Chandrasekhar Rao on Thursday assured the Christian community that his government would not tolerate attacks on pastors. He stated that the government would take stern action against those responsible for such attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X