పుట్టిన రోజు కానుక: జర్నలిస్టులపై కేసీఆర్ వరాల వర్షం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్టులపై వరాల వర్షం కురిపించారు. కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్‌లో జనహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చనిపోయిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. 84 మంది జర్నలిస్టు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేశారు.

హ్యాపీ బర్త్‌ డే: కేసీఆర్‌కు మోడీ ఫోన్, ఏం చెప్పారంటే..?, ఫొటోతో కేటీఆర్ ఇలా..

ఏ ఆధారం లేని జర్నలిస్టు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. జర్నలిస్టుల పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉందని, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా బడ్జెట్ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈ సారి మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే రూ. పదికోట్ల చొప్పున రెండేళ్లు సంక్షేనిధికి జమ చేశారని తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో రూ. 30 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల్లో ఎవరైనా పెళ్లీడుకు వచ్చిన ఆడబిడ్డలుంటే వారి పెళ్లి కోసం రూ. 3లక్షల ఆర్థిక సహాయం సీఎం ప్రకటించారు. అలాగే చనిపోయిన జర్నలిస్టు కటుంబాల్లో ఇండ్లు లేని వారికి వారి సొంత జిల్లాల్లో వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేయమని ఆధికారులను ఆదేశించారు.

KCR gifts to journalists

ఈ ప్రక్రియను ప్రెస్‌అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణను చూసుకోవాల్సిందిగా కోరారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది జర్నలిస్టులకు ఎక్కడికక్కడే ఇళ్లస్థలాలను కూడా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. జర్నలిస్టులకు ఏవైనా ఆర్థిక భారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్ అకాడమీని సంప్రదించి వారిద్వారా తన దృష్టికి తేవాలని సూచించారు.

దేశం కోసం పారాడుతున్న సైనికుల బాగోగులు చూస్తన్నట్లే సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.

'రాష్ట్రం 19.5శాతం ఆర్థిక పురోగతితో దేశంలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో రాజకీయ అవినీతిని తగ్గించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే జలాశయాల పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గతంలో విద్యుత్‌ ఉంటే వార్త.. ప్రస్తుతం విద్యుత్‌ పోతే వార్త. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామీణ జీవనంలో మార్పులు వస్తాయి' అని వివరించారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, సమాచారశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday announces gifts to journalists.
Please Wait while comments are loading...