హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిథాలీ రాజ్‌కు రూ.కోటి, బంజారాహిల్స్‌లో 600 గజాల స్థలం

ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ సీఎం నజరానా ప్రకటించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మిథాలీ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ సీఎం నజరానా ప్రకటించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మిథాలీ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

చదవండి: సానియా, సింధులకైతే అలా..: కెసిఆర్‌కు మిథాలీ రాజ్ పట్టదా?

మహిళల క్రికెట్ ప్ర‌పంచ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీని కేసీఆర్ అభినందించారు.

KCR govt gives Rs 1 cr to Mithali Raj

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మిథాలీ, కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తికి శాలువా కప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్ గా తీర్చిదిద్దారంటూ కొచ్ ను ప్రశంసించారు.

ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారని ,దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో పైనల్‌లో ఓడిపోయారన్నారు. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడిందన్నారు. తాను ఫైనల్ మ్యాచ్ చూశానని కెసిఆర్ చెప్పారు.

మిథాలీ రాజ్‌కు ప్రభుత్వం తరుఫున రూ.కోటి నగదు ప్రోత్సాహాన్ని, బంజారాహిల్స్ లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు.

English summary
Telangana Government gave Rs 1 crore to cricketer Mithali Raj for team india performance in women world cup final.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X