ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదిలాబాద్‌లో కెసిఆర్: తలపాగాతో ఇలా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను అధిగమించి, మిగులు విద్యుత్‌తో వెలుగులు నింపడమే ప్రభుత్వం ముందున్న మొదటి లక్ష్యమని సిఎం చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వచ్చే నవంబర్‌లోగా జైపూరు థర్మల్ ప్రాజెక్టు ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూరు మండలం షెట్‌పల్లివద్ద సింగరేణి సంస్థ 3570 కోట్ల వ్యయంతో చేపట్టిన 600 మెగావాట్ల 3వ యూనిట్ విద్యుత్ ప్రాజెక్టు పనులకు మంగళవారం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ఉత్పాదనపై దృష్టిసారించిందన్నారు. విద్యుత్ సమస్య తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో అన్ని వనరులు ఉన్న ఆదిలాబాద్ జిల్లా జైపూరు వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా 1200 మెగావాట్ల విద్యుదుత్పాదన పనులను వేగవంతం చేసి నవంబర్ 15లోగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సిఎం ఆదేశించారు.

భూసేకరణలో ఇబ్బందులున్నాయని అధికారులు చెప్పగా, ఎమ్మెల్యేలతో కలిసి భూనిర్వాసితులకు పరిహారంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, వెంటనే ఉత్పాదక సామార్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. బిహెచ్‌ఈఎల్, సింగరేణి అధికారులు సమష్టిగా కృషి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సిఎం సూచించారు. సమావేశంలో సింగరేణి సిఎండి శ్రీధర్, బిహెచ్‌ఈఎల్ చైర్మెన్ ప్రసాద్‌రావు, సింగరేణి డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను అధిగమించి, మిగులు విద్యుత్‌తో వెలుగులు నింపడమే ప్రభుత్వం ముందున్న మొదటి లక్ష్యమని సిఎం చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

వచ్చే నవంబర్‌లోగా జైపూరు థర్మల్ ప్రాజెక్టు ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించారు.

కెసిఆర్

కెసిఆర్

ఆదిలాబాద్ జిల్లా జైపూరు మండలం షెట్‌పల్లివద్ద సింగరేణి సంస్థ 3570 కోట్ల వ్యయంతో చేపట్టిన 600 మెగావాట్ల 3వ యూనిట్ విద్యుత్ ప్రాజెక్టు పనులకు మంగళవారం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ఉత్పాదనపై దృష్టిసారించిందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

విద్యుత్ సమస్య తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో అన్ని వనరులు ఉన్న ఆదిలాబాద్ జిల్లా జైపూరు వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా 1200 మెగావాట్ల విద్యుదుత్పాదన పనులను వేగవంతం చేసి నవంబర్ 15లోగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సిఎం ఆదేశించారు.

కెసిఆర్

కెసిఆర్

అయితే ముందనుకున్న ప్రకారం గడువులోగా థర్మల్ ప్రాజెక్టు పనులు పూర్తిచేయకపోవడంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలేకుండా ప్రజలకు వెలుగులు పంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ విషయంలో అధికారులు, సింగరేణి యాజమాన్యం, బిహెచ్‌ఈఎల్ సంస్థ ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని సిఎం ఆదేశించారు.

కెసిఆర్

కెసిఆర్

ముందుగా జైపూర్‌లో 1200 మెగావాట్ల పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు బ్యాలెన్స్ ప్లాంట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

కెసిఆర్

కెసిఆర్

కొత్తగా పనులు ప్రారంభించే 600 మెగావాట్లకు సంబంధించి 3వ యూనిట్ పనుల్లో బాయిలర్ టర్బన్ వర్క్స్ (బిటిజి) పూర్తి చేసి 30 నెలల్లోగా విద్యుత్ అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

షెట్‌పల్లి నుండి జైపూరు ప్లాంట్ వరకు ఒక టిఎంసి నీటి సరఫరా కోసం, శ్రీరాంపూర్ నుండి జైపూరు వరకు రైల్వే ట్రాక్‌ కొరకు పనులు చేపట్టకపోవడానికి సిఎం కెసిఆర్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

భూసేకరణలో ఇబ్బందులున్నాయని అధికారులు చెప్పగా, ఎమ్మెల్యేలతో కలిసి భూనిర్వాసితులకు పరిహారంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, వెంటనే ఉత్పాదక సామార్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

బిహెచ్‌ఈఎల్, సింగరేణి అధికారులు సమష్టిగా కృషి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

భూములు కోల్పోయిన రైతులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సిఎం సూచించారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao today laid the foundation stone for the third unit of the power plant of Singareni Collieries Company Limited at Pegadpally village of Jaipur mandal in the coal belt of Adilabad District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X