హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందే వెళ్లిన కేసీఆర్, తెలుగులో గవర్నర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10.30 గంటలకు గవర్నర్ పతాకావిష్కరణ చేసేందుకు కేవలం ఒక నిమిషం ముందు వచ్చారు.

గవర్నర్ రాకకు పది నిమిషాల ముందే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ఆయన మంత్రివర్గ సహచరులు వచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తదితర కూడా ముందే వచ్చారు.

గవర్నర్ ప్రసంగం 11 గంటలకు ప్రారంభమై 11.20 గంటలకు పూర్తయింది. గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే కేసీఆర్ వెళ్లిపోయారు. మంత్రివర్గ సహచరులు కేసీఆర్‌ను పంపించి తిరిగి తమ స్థానాలకు చేరారు. ఆ తర్వాత బహుమతి ప్రదాన కార్యక్రమం కొనసాగింది.

గణతంత్ర

గణతంత్ర

అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తూ, అన్ని రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బంగారు తెలంగాణ సాధిస్తామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.

గణతంత్ర

గణతంత్ర

66వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పెరేడ్ మైదానంలో జరిగిన రాష్టస్థ్రాయి అధికారిక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి 20 నిమిషాలపాటు ప్రసంగించారు.

 గణతంత్ర

గణతంత్ర

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి గణతంత్ర వేడుకలు ఇవేకావడంతో ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఉదయం 10.30కు పెరేడ్ మైదానానికి గవర్నర్ చేరగానే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గణతంత్ర

గణతంత్ర


తర్వాత రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉదయం 11 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ 20నిమిషాల్లో ముగించారు.

గణతంత్ర

గణతంత్ర

తెలుగుభాషలో ప్రసంగాన్ని ప్రారంభించి, ఇంగ్లీషులో కొనసాగించారు. చివరలో మళ్లీ తెలుగులో ప్రసంగాన్ని ముగిస్తూ ప్రజలు ఆశిస్తున్న బంగారు తెలంగాణ సాధన లక్ష్యంతో అహర్నిశలు, అనుక్షణం కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు.

గణతంత్ర

గణతంత్ర


శాంతియుత పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణను దేశంలో ఉన్నతమైన రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు తన ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.

గణతంత్ర

గణతంత్ర

పేదరికం, వెనుకబాటుతనానికి కారణం ఉన్నతస్థాయిలో, మరీ ముఖ్యంగా రాజకీయ అవినీతి కారణమని గవర్నర్ నిర్ధ్వందంగా ప్రకటించారు.

 గణతంత్ర

గణతంత్ర

ఫార్మా, ఐటి, మైనింగ్, ఉత్పాదక రంగం, టెక్స్‌టైల్ రంగాల్లో పెట్టుబడులకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. పారిశ్రామిక రంగం కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చామని వివరించారు.

గణతంత్ర

గణతంత్ర

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా 2014-15 సంవత్సరానికి లక్ష కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదించినట్టు గుర్తు చేశారు.

 గణతంత్ర

గణతంత్ర

తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తింపు పొందాయని, ఇవి వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ (బిఆర్‌జిఎఫ్) పరిధిలోకి వచ్చాయన్నారు. ఈ కారణంగానే తెలంగాణలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.

 గణతంత్ర

గణతంత్ర

ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలతో జింక, పాలపిట్ట, జమ్మిచెట్టు, తంగేడుపూలను ముడిపడి ఉండటం వల్ల వీటిని రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించామని గవర్నర్ తెలిపారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao attracted the attention of people attending the official Republic Day celebration at Parade Ground in Secunderabad by leaving the venue even before the function was over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X