హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసేందుకు..: గవర్నర్‌తో సీఎం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, మంత్రులకు అదనపు శాఖల కేటాయింపు, తన ఢిల్లీ పర్యటన తదితర అంశాలపై చర్చించారు.

బడ్జెట్ సమావేశాల తేదల పైన కూడా చర్చ జరిగింది. అదే సమయంలో హైదరాబాదును విశ్వనగగరంగా మార్చడం పైన ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించారు.

 గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సత్వర కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు గురువారం తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియ ముగిసినందున పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపడుతున్నామని కెసిఆర్ వివరించారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గురువారం సీఎం రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. నగరంలో రాజకీయ అనిశ్చితికి వీల్లేకుండా అధికార పార్టీకి సంపూర్ణ మెజారిటీ కల్పించారని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

నారాయణఖేడ్‌ అసెంబ్లీ సెగ్మెంటు ఎన్నికల తర్వాత వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు.

 గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

గవర్నర్‌ దంపతులు మేడారం జాతరకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు లక్షల మంది తరలివస్తున్నారని, సకల వసతులు కల్పించామని తెలిపారు. తాను ఈ నెల 19న జాతరకు వెళ్తున్నట్లు చెప్పారు.

English summary
CM KCR met Governor Narasimhan and discuss about GHCM elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X