హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులు, తెరాస వాళ్లున్నా వదలొద్దు: డ్రగ్స్ కేసుపై కేసీఆర్, లిస్ట్ ఇచ్చిన అకున్

డ్రగ్స్ కేసులో ధైర్యంగా ముందుకు వెళ్లాలని, కేసులో ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దని, సంకోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, అధికారులకు ఆదేశాలిచ్చారని తెలుస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ధైర్యంగా ముందుకు వెళ్లాలని, కేసులో ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దని, సంకోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, అధికారులకు ఆదేశాలిచ్చారని తెలుస్తోంది.

<strong>థర్డ్ లిస్ట్‌లో యంగ్ హీరోయిన్స్, నేతల పిల్లలు?: ఆరుగురి పేర్లు బయటకొస్తే పెద్ద కుదుపు</strong>థర్డ్ లిస్ట్‌లో యంగ్ హీరోయిన్స్, నేతల పిల్లలు?: ఆరుగురి పేర్లు బయటకొస్తే పెద్ద కుదుపు

ప్రగతి భవన్‌లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసుపై సమీక్షించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ అంశంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారని తెలుస్తోంది.

KCR orders strict action against accusers in drug racket case

విచారణలో ఆటంకాలు ఎదురైతే, తాను అండగా ఉంటానని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. పెద్దవారు ఎవరు ఉన్నా వాళ్ల పేర్లు బయటకు తీయాలని ఆదేశించారని సమాచారం.

Recommended Video

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed

కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో మూడో జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని, వారందరికీ నోటీసులు పంపాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రాథమిక సాక్ష్యాలు తర్వాతే వారి పేర్లు బయట పెట్టనున్నారు.

డ్రగ్స్ వాడకం ఎప్పటి నుంచో ఉంది: కేసీఆర్

హైదరాబాదులో డ్రగ్స్ వాడటం ఎప్పటి నుంచో ఉందని సమీక్ష సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని చెప్పారు. డ్రగ్స్ కేసులో దూకుడు పెంచాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డ్రగ్స్ అంతం కావాలని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్నారు.

డ్రగ్స్ కేసులో టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఉన్నా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించవద్దన్నారు. సెలవులపై వెళ్లొద్దని అకున్‌కు తానే సూచించానని, కేసులో అన్నీ వెలికి తీయాలని ఆదేశించానని చెప్పారు.

నివేదిక ఇచ్చిన సబర్వాల్

డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు జారీ చేసారో, ఎంతమందికి నోటీసులు ఇచ్చారో, ఎంతమందిని అరెస్టు చేశారనే వివరాలను నివేదిక రూపంలో కేసీఆర్‌కు అందించారు.

ఈ సందర్భంగా ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయని అకున్ సబర్వాల్ చెప్పగా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మీ పని మీరు చేసుకొని వెళ్లాలని చెప్పారని తెలుస్తోంది.

English summary
With the drug racket scandal rocking Telangana, the state government is taking some serious measures against it. Chief Minister K Chandrasekhar Rao has order Excise and Enforcement Director Akun Sabharwal, who is probing the sensational drug scandal case to take strict action on the accusers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X