వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసైన్డ్ భూముల్లో అక్రమాలపై కేసీఆర్ ఫైర్ : లెక్కలు తేల్చాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్నారు కేసీఆర్. వినూత్న పథకాలు, ప్రజా సంక్షేమంతో పాటు అవినీతి లెక్కలను కూడా సరి చేసే దిశగా ఆయన పాలన సాగుతోంది. ఇదే క్రమంలో తాజాగా రెవెన్యూ శాఖపై ఫోకస్ చేసిన కేసీఆర్, అసైన్డ్ భూముల్లో అక్రమదారుల పాగాపై లెక్కలు బయటపెట్టాలని అధికారలకు సూచించారు.

రాష్ట్రంలో ఉన్న చాలామేరకు అసైన్డ్ భూములను బడాబాబులు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలున్నాయి.
దీంతో ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఈ భూములు అసలైన లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కూడా ఇందుకు ఓ కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను పంపిణీ చేస్తూ పోయారే తప్పితే, ఎంతమంది అసలైన లబ్దిదారులు దీని ద్వారా ప్రయోజనం పొందారన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

kcr orders to revenue officials on assigned lands

ఈ నేపథ్యంలోనే.. అసలు ఇప్పటిదాకా ఆయా ప్రభుత్వాలు పంపిణీ చేసిన మొత్తం 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల లెక్కలు బయటకు తీయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇందులో అసలైన లబ్దిదారులు ఎంతమంది..? ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నాయి..? ఎంతమేర అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి..? వంటి లెక్కలను పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

అయితే.. సీఎం ఆదేశాలను ఆచరణలో పెట్టడానికి అధికారులు ఎంత వ్యవధిని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భూములు అన్యాక్రాంతమయ్యాయని తేలితే వాటిని తిరిగి అసలైన లబ్డిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉండడంతో సీఎం నిర్ణయంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

English summary
telangana cm seriously focused on revenue assigned lands. He ordered the officials too
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X